క్రీడాభూమి

డేవిడ్ వార్నర్ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, సెప్టెంబర్ 4: శ్రీలంకతో ఆదివారం జరిగిన ఐదవ, చివరి వనే్డ ఇంటర్నేషనల్‌ను ఆస్ట్రేలియా మరో 42 బంతులు మిగిలి ఉండగానే, ఐదు వికెట్ల తేడాతో గెల్చుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ కెరీర్‌లో ఏడో వనే్డ శతకాన్ని నమోదు చేసి, ఆసీస్ విజయానికి తోడ్పడ్డాడు. అతని విజృంభణతో, 196 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛేదించింది. సిరీస్‌ను 4-1 తేడాతో కైవసుం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 40.2 ఓవ
ర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. టాప్ ఆర్డర్‌లో ధనంజయ డిసిల్వ (34), ధనుష్క గుణతిలకే (39), కుశాల్ మేండిస్ (33) మెరుగ్గా రాణించినప్పటికీ, మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో సచిత్ పతిరానా (32) కొంత సేపు ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. మిచెల్ స్టార్క్ 40 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ఆడం జంపా, ట్రావిస్ హెడ్ చెరి రెండు వికెట్లు సాధించారు. విజయానికి 196 పరుగులు సాధించాల్సి ఉండగా, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. మాథ్యూ వేడ్ (3), ఉస్మాన్ ఖాజా (6) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అయితే, కెప్టెన్ వార్నర్, జార్జి బెయిలీ మూడో వికెట్‌కు 132 పరుగుల అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని అందించారు. 73 బంతుల్లో బెయిలీ 44 పరుగులు సాధించాడు. ట్రావిస్ హెడ్ 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వార్నర్ 126 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్ల సాయంతో 106 పరుగులు చేసి వెనుదిరిగాడు. అప్పటికి ఆసీస్ స్కోరు 189 పరుగులు. చివరిలో జేమ్స్ ఫాల్క్‌నెర్ (8), జాన్ హేస్టింగ్స్ (8) మరో వికెట్ కూలకుండా ఆస్ట్రేలియాను లక్ష్యానికి చేర్చారు. లంక బౌలర్లలో దిల్‌రువాన్ పెరెరా 51 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ధనంజయ డిసిల్వకు 2 వికెట్లు లభించాయి.