క్రీడాభూమి

క్వార్టర్స్‌కు సానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 6: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో ఏడో సీడ్ జోడీగా బరిలోకి దిగిన సానియా, స్ట్రికోవా సోమవారం ఇక్కడ జరిగిన మహిళల డబుల్స్ మూడో రౌండ్ పోరులో నికోల్ గిబ్స్ (అమెరికా), నావో హిబినో (జపాన్) జోడీపై వరుస సెట్ల తేడాతో విజయం సాధించారు. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా, స్ట్రికోవా 6-4, 7-5 తేడాతో ప్రత్యర్థులను మట్టికరిపించారు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, రోహన్ బొపన్న ఇప్పటికే తమతమ భాగస్వాములతో కలసి నిష్క్రమించడంతో ఇక ఈ టోర్నీలో భారత్ తరఫున సానియా మాత్రమే బరిలో ఉంది.
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన లియాండర్ పేస్, అతని భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) రెండో రౌండ్‌లోనే అమెరికాకు చెందిన ఏడో సీడ్ జోడీ రాజీవ్ రామ్, కోకో వాండ్వెఘే చేతిలో పరాజయం పాలవగా, ఇదే విభాగంలో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బొపన్న, గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా) విజయం కోసం తీవ్రంగా శ్రమించి సూపర్ టై-బ్రేకర్ వరకు నెట్టుకొచ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. రాబర్ట్ ఫరా (కెనడా), అనా లెనా గ్రొయెన్‌ఫీల్డ్ (జర్మనీ) జోడీతో జరిగిన ఈ పోరులో బొపన్న, దబ్రోవ్‌స్కీ 6-1, 2-6, 8-10 తేడాతో ఓటమిపాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.