క్రీడాభూమి

పతకాలు తెస్తే.. నగదు పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో బుధవారం నుంచి ప్రారంభమయ్యే పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు ఒలింపిక్ పతక విజేతలతో సరిసమానంగా నగదు పురస్కారాలను అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. పారాలింపిక్ క్రీడల్లో పసిడి పతకాలు సాధించిన వారికి 75 లక్షల రూపాయలు, రజత పతకం సాధించిన వారికి 50 లక్షల రూపాయలు, కాంస్య పతకం సాధించిన వారికి 30 లక్షల రూపాయలు చొప్పున నగదు బహుమతులను అందజేస్తామని క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ట్విట్టర్’లో ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం పారాలింపిక్స్‌లో 17 మంది అథ్లెట్లతో కూడిన అతిపెద్ద బృందం భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో 2004లో జరిగిన పారాలింపిక్ క్రీడల్లో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించిన దేవేంద్ర జఝారియా ఈ బృందంలో ప్రధాన ఆకర్షణగా ఉన్నాడు. ఎఫ్-46 కేటగిరీ జావెలిన్‌త్రో ఈవెంట్‌లో పతకం సాధించాలని అతను లక్ష్యంగా నిర్ధేశించుకున్నాడు.
భారత పారాలింపిక్ బృందం ఇదీ
మరియప్పన్ తంగవేలు (హైజంప్), వరుణ్ సింగ్ భాటి (హైజంప్), పూజా (ఆర్చరీ), శరద్ కుమార్ సింగ్ (హైజంప్), రామ్‌పాల్ చహర్ (హైజంప్), సుందర్ సింగ్ గుర్జార్ (జావెలిన్‌త్రో), దేవేంద్ర జఝారియా (జావెలిన్‌త్రో), రింకూ (జావెలిన్‌త్రో), నరేందర్ రణ్‌బీర్ (జావెలిన్‌త్రో), సందీప్ (జావెలిన్‌త్రో), అమిత్ కుమార్ సరోహా (క్లబ్‌త్రో), దీపా మాలిక్ (షాట్‌పుట్), ధరమ్‌వీర్ (క్లబ్‌త్రో), అంకుర్ ధమా (1500 మీటర్ల పరుగు), బాషా ఫర్మాన్ (పవర్‌లిఫ్టింగ్), సుయాష్ నారాయణ్ జాదవ్ (స్విమ్మింగ్), నరేష్ కుమార్ శర్మ (షూటింగ్).