క్రీడాభూమి

స్పెయిన్ జట్టులో నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: భారత్‌తో త్వరలో జరగబోయే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీ కోసం స్పెయిన్ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. స్పెయిన్ ఈ పోటీ కోసం ప్రకటించిన జట్టులో ఒకప్పటి ప్రపంచ నంబర్ వన్, 14 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్ల విజేత రఫెల్ నాదల్‌తో పాటుగా ప్రపంచ నంబర్ 13 క్రీడాకారుడు డేవిడ్ ఫెరర్, 18 నంబర్ క్రీడాకారుడు ఫెలిసియానో లోపెజ్‌తో పాటుగా డబుల్స్‌లో ప్రపంచంలో 19వ నంబరు క్రీడాకారుడైన మార్క్ లోపెజ్‌లున్నారు. స్పెయిన్‌తో పోలిస్తే భారత జట్టులో అంతగా చెప్పుకోదగిన క్రీడాకారులు ఎవరూ లేరు. డబుల్స్‌లో రోహన్ బోపన్న, లియాండర్ పేస్‌లు అంతర్జాతీయంగా పేరున్న వారే అయినప్పటికీ సింగిల్స్‌లో సాకేత్ మైనేని, రాంకుమార్ రామనాథన్‌లు నాదల్, ఫెరర్‌ల ముందు తీసికట్టేనని చెప్పాలి. అయితే తమ శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో అపదర్శించడానికి ఇదో అవకాశమని సాకేత్ మైనేని వ్యాఖ్యానించడం గమనార్హం.