క్రీడాభూమి

ఆస్ట్రేలియా రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లికల్, సెప్టెంబర్ 6: అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. మంగళవారం పల్లికల్‌లో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓపెనర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (145 నాటౌట్) దుమ్ము రేపడంతో ఆస్ట్రేలియా జట్టు 263 పరుగుల భారీ స్కోరు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అనంతరం ఆతిథ్య జట్టులో కెప్టెన్ దినేష్ చండీమల్ (58), చమర కపుగెదర (43) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోవడంతో 9 వికెట్ల నష్టానికి 178 పరుగులకే పరిమితమైన శ్రీలంకకు 85 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదురైంది.