క్రీడాభూమి

నేటినుంచి ఇండోనేసియా గ్రాండ్‌ప్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలిక్ పాపన్ (ఇండోనేసియా), సెప్టెంబర్ 6: వరస గాయాల కారణంగా రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్న తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ బుధవారంనుంచి ఇక్కడ ప్రారంభం కానున్న ఇండోనేసియా గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్‌లో పాల్గొనడం ద్వారా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించనున్నాడు. లండన్ ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనలిస్టయిన కశ్యప్, 2014 జాతీయ చాంపియన్ హెచ్‌ఎస్ ప్రణయ్ సహా మొత్తం ఏడుగురు భారతీయ క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలోతమ సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. గత రెండు నెలలుగా తాను బాగా శ్రమిస్తున్నానని, ఇప్పుడు తాను పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నానని కశ్యప్ అంటూ, ఓకటి రెండు మ్యాచ్‌లు,లేదా టోర్నమెంట్‌లో ఆడితే తాను తిరిగి గాడిలో పడతానని భావిస్తున్నట్లు చెప్పాడు. కాగా తొలి రౌండ్‌లో కశ్యప్ స్థానిక క్రీడాకారుడు నతానియేల్ ఎర్నెస్టన్‌ను ఎదుర్కోనున్నాడు. కాగా, గత కొన్ని నెలలుగా గాయలతో బాధపడుతున్న మరో క్రీడాకారుడు ప్రణయ్ కూడా ఈ టోర్నమెంట్ ద్వారా తిరిగి అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడడం మొదలు పెట్టనున్నాడు. మన దేశం తరఫున ఈ టోర్నమెంట్‌లో ఆడనున్న వారిలో అజయ్ జయరాం, సాయి ప్రణీత్‌తో పాటుగా హర్షీల్ దాని, సిరిల్ వర్మ, కౌశల్ ధర్మమేర్ అభిషేక్ యెలెగార్‌లు కూడా ఉన్నారు. కాగా, క్వాలిఫైయర్స్‌లో సునాయాస విజయం ద్వారా నందగోపాల్, సనమ్ శుక్లా జోడీ డబుల్స్ విభాగంలో మెయిన్‌డ్రాకు అర్హత సాధించారు.

చిత్రం.. కశ్యప్