క్రీడాభూమి

ముంబయిలో సింధుకి సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 6: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్న ‘తెలుగు తేజం’ పివి.సింధుతో పాటు ఆమె విజయం వెనుక కీలకపాత్ర పోషించిన జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను మహారాష్ట్ర బాడ్మింటన్ అసోసియేషన్ మంగళవారం ముంబయిలో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వినోద్ తావ్డే హాజరై సింధుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ లఖానీ మాట్లాడుతూ, దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు, గొప్ప కోచ్‌లకు కొదవ లేకపోయినప్పటికీ వారికి తగిన తోడ్పాటు, సరైన వౌలిక వసతులు లేకపోడం ఆందోళన కలిగిస్తోందని విచారాన్ని వ్యక్తం చేశారు.