క్రీడాభూమి

సత్యవ్రత్ కదియన్‌తో సాక్షి మాలిక్ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుని యావత్ దేశ ప్రజల హృదయాలను కొల్లగొట్టిన రెజ్లర్ సాక్షి మాలిక్ (24) తన కంటే రెండేళ్ల చిన్నవాడైన వ్యక్తిని వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆమె హృదయాన్ని దోచుకున్న వ్యక్తి ఎవరో కాదు. అంతర్జాతీయ పోటీల్లో విజయవంతమైన సహచర రెజ్లర్ సత్యవ్రత్ కదియన్. వీరిద్దరూ హర్యానాలోని రోహ్తక్‌కు చెందిన వారే. వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొత్తేమీ కాదు. వీరి మధ్య ఎప్పటి నుంచో ఉన్న పరిచయం సామాజిక మాధ్యమాల ద్వారా పెరిగి పెద్దదైంది. దీంతో ఒకరి గురించి మరొకరు లోతుగా తెలుసుకుని పరస్పరం ప్రేమించుకున్నారు. రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని గెలిచిన వెంటనే సత్యవ్రత్ ‘ఫేస్‌బుక్’ ద్వారా ఆమెకు అభినందన సందేశం పంపాడు. సాక్షి మాలిక్‌కు మాదిరిగా సత్యవ్రత్ ఒలింపిక్ పతకం సాధించకపోయినప్పటికీ అతను 97 కిలోల విభాగంలో పలు అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీల్లో సత్తా చాటుకున్నాడు. 2014లో గ్లాస్గోలో జరిగిన కామనె్వల్త్ క్రీడల్లో రజత పతకాన్ని కైవసం చేసుకున్న సత్యవ్రత్, అదే ఏడాది ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. సత్యవ్రత్‌ను పెళ్లి చేసుకున్నాక రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ తన కెరీర్‌ను కొనసాగిస్తుందా? లేదా? అన్నది తెలియరాలేదు. అయితే వివాహం తర్వాత కూడా సాక్షి మాలిక్ కెరీర్ కొనసాగించాలని సత్యవ్రత్ ఆశిస్తున్నట్లు సమాచారం. సత్యవ్రత్ తండ్రి సత్యవాన్ రోహ్తక్ పట్టణంలో ప్రముఖ అఖారాను నడుపుతున్నారు. స్వతహాగా రెజ్లర్ అయిన సత్యవాన్ 1988లో సియోల్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. సత్యవాన్ కృషిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనను అర్జున అవార్డుతో సత్కరించింది.

చిత్రం.. దంపతులు కాబోతున్న రెజ్లర్లు సాక్షి మాలిక్, సత్యవ్రత్ కదియన్