క్రీడాభూమి

ఫెదరర్ రికార్డు సెరెనా సొంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 6: మహిళా టెన్నిస్ రంగంలో ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన సెరెనా విలియమ్స్ సోమవారం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. యుఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో యరోస్లావా స్వెదోవాపై 6-2,6-3 స్కోరుతో వరస సెట్లలో సునాయాస విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టడం ద్వారా గ్రాండ్‌శ్లామ్ టోర్నమెంట్లలో అత్యధిక విజయాలు సాధించిన వ్యక్తిగా రోజర్ ఫెదరర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ఫెదరర్ ఖాతాలో 307 విజయాలు ఉండగా, సెరెనా ఇప్పుడు 308 విజయాలు నమోదు చేసింది. సెరెనా మరిన్ని విజయాలు సాధించే అవకాశముంది. కాగా,మీ రికార్డును ఎవరు బద్దలు కొడతారన్న ప్రశ్నకు తనకు తెలియదని ఆమె సమాధానం చెప్పింది. అంతేకాదు ఫెదరర్, తాను ఇద్దరు కూడా మరి కొంతకాలం కొనసాగుతామని ఆశిస్తున్నట్లు మ్యాచ్ అనంతరం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెరెనా చెప్పింది. ఫెదరర్ ఆగస్టు 8న 36వ పడిలో అడుగుపెట్టగా విలియమ్స్‌కు ఈ నెల 26న 35 ఏళ్లు నిండనున్నాయి.
సెరెనా తన తొలి గ్రాండ్‌శ్లామ్ విజయాన్ని 16 ఏళ్ల వయసులో నమోదు చేసింది. 1998 జనవరి 19న ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్‌లో ఇర్నియా స్పిర్లియాపై 6-7(5-7), 6-3, 6-1 స్కోరుతో విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్‌లోనే ఆమె తన తొలి ఓటమిని కూడా చవి చూసింది. సోదరి వీనస్ విలియమ్స్ చేతిలో ఆమె ఓడిపోయింది. అప్పటినుంచి దాదాపు రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. చాంపియన్‌షిప్స్‌లోను, ఆరోగ్యపరంగా ఎన్నో ఎత్తు పల్లాలను చూసినప్పటికీ ఇంకా ఆడడమే కాదు, వరస విజయాలూ సాధిస్తూ వస్తోంది. కాగా, తన రికార్డు గురించి సెరెనా మాట్లాడుతూ ఇది నిజంగా చాలా పెద్ద సంఖ్య అని, తాను ఇంతకాలం ఆడుతానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. అన్నిటికన్నా ముఖ్యంగా తాను నిలకడగా ఆడగలుగుతున్నానని, అందుకు నిజంగా గర్వంగా ఉందని కూడా సెరెనా చెప్పింది. 36 ఏళ్ల వయసులో కూడా విలియమ్స్ ఇంకా చురుగ్గా అడుతుంటే ఆమె సమకాలికుల్లో చాలామంది అంతర్జాతీయ టెన్నిస్‌లో ఓ మెరుపుమెరిసి కనుమరుగై పోయారు కూడా. అలాంటి వారిలో జస్టిస్ హెనిన్, కిమ్ క్లిజ్‌స్టర్‌లు సెరెనా కన్నా చిన్న వాళ్లయితే మార్టినా హింగిస్ ఓ ఏడాది మాత్రమే పెద్ద. తాను ఇంతకాలం ఆడతానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పిన సెరెనా అదే విధంగా తాను ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తానో కూడా తనకే తెలియదని చెప్పడం గమనార్హం.
ఇక సెరెనా మొత్తం కెరీర్‌లో 308 విజయాలు ఉంటే 42 మాత్రమే ఓటములున్నాయి. ఈ విజయాల్లో యుఎస్ ఓపెన్‌లో అత్యధికంగా 88 విజయాలు నమోదు చేయగా, వింబుల్డన్‌లో 86, ఆస్ట్రేలియా ఓపెన్‌లో 76, ప్రెంచ్ ఓపెన్‌లో60 విజయాలున్నాయి. కాగా, సెరెనా రికార్డును ఇప్పట్లో ఎవరూ చివరికి ఫెదరర్ కూడా అధిగమించే అవకాశం లేదు. ఎందుకంటే గాయం కారణంగా యుఎస్ ఓపెన్‌కు దూరమైన ఫెదరర్ ఈ ఏడాది చివరి దాకా రాకెట్ పట్టే అవకాశాలు లేవు. మరోవైపు సెరెనా యుఎస్ ఓపెన్‌లో మరిన్ని విజయాలు నమోదు చేసే అవకాశాలున్నాయి.
కొంజు సంచలనం
ఇదిలావుంటే, మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి అనా కొంజు, పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా సంచలన విజయాలను నమోదు చేసుకున్నారు. నాలుగో సీడ్ క్రీడాకారిణి అగ్నేస్కా రద్వాన్‌స్కాతో జరిగిన పోరులో కొంజు 6-4, 6-4 తేడాతో గెలుపొందగా, ప్లిస్కోవా 4-6, 6-4, 7-6 తేడాతో ఆరో సీడ్ వీనస్ విలియమ్స్‌కు చెక్ పెట్టింది. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ సిమోనా హాలెప్ 6-2, 7-5 తేడాతో 11వ సీడ్ కార్లా సువారెజ్ నవర్రోను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించింది.
కాగా, పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ ఆటగాడు ఆండీ ముర్రే, మూడో సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా, ఆరో సీడ్ కై నిషికోరి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. నాలుగో రౌండ్‌లో ముర్రే 6-1, 6-2, 6-2 తేడాతో 22వ సీడ్ గ్రిగర్ దిమిత్రోవ్‌పై, వావ్రిన్కా 6-4, 6-1, 6-7, 6-3 తేడాతో ఇల్యా మర్చెంకోపై విజయం సాధించగా, నిషికోరి 6-3, 6-4, 7-6 తేడాతో 21వ సీడ్ ఇవో కార్లోవిచ్‌ను ఓడించాడు. మరో మ్యాచ్ నుంచి 8వ సీడ్ ఆటగాడు డొమినిక్ థియెమ్ అర్థంతరంగా నిష్క్రమించడంతో అప్పటికి 6-3, 3-2 తేడాతో ఆధిక్యతలో ఉన్న అన్‌సీడెడ్ ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పోట్రో (అర్జెంటీనా) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.