క్రీడాభూమి

సానియా, బార్బరా జోడీ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 7: చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా స్ట్రికోవాతో కలిసి యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో పోటీపడిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమిపాలైంది. కరోలిన్ గార్సియా, క్రిస్టినా మ్లడెన్కొవిచ్ జోడీతో తలపడిన వీరు 6-7, 1-6 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలై నిష్క్రమించారు. మొదటి సెట్‌లో కొంత వరకు పోరాడిన సానియా, బార్బరా జోడీ రెండో సెట్‌లో దారుణంగా విఫలమయ్యారు. నిరుడు మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించిన సానియాకు ఈ ఏడాది నిరాశ తప్పలేదు. మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ ఆమె ఇప్పటికే నిష్క్రమించింది. కాగా, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో తమతమ భాగస్వాములతో కలిసి ఆడిన రోహన్ బొపన్న, లియాండర్ పేస్, సాకేత్ మైనేనీ కూడా వైఫల్యాలను చవిచూడడంతో యుఎస్ ఓపెన్‌లో భారత్ పోరాటానికి తెరపడింది. నిరుడు మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో మార్టినా హింగిస్‌తో కలిసి ఆడిన పేస్ విజేతగా నిలిచాడు. మొత్తం మీద మహిళల డబుల్స్‌లో సానియా, మిక్స్‌డ్ డబుల్స్‌లో పేస్ డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగినప్పటికీ, అదే స్థాయి ఆటను కొనసాగించలేక చేతులెత్తేశారు.