క్రీడాభూమి

మహిళల సెమీఫైనల్‌లో కెర్బర్, వొజ్నియాకి ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 7: యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ మొదటి సెమీ ఫైనల్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్, మాజీ వరల్డ్ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి ఢీ కొంటారు. క్వార్టర్ ఫైనల్స్‌లో కెర్బర్ 7-5, 6-0 తేడాతో ఏడో సీడ్ రాబర్టా విన్సీపై విజయభేరి మోగించింది. మొదటి సెట్‌లో గట్టిపోటీనిచ్చిన విన్సీకి రెండు సెట్‌లో కోలుకునే అవకాశం ఇవ్వకుండా కెర్బర్ దాడులను కొనసాగించింది. పూర్తి ఆధిపత్యాన్ని కనబరచి, సెమీస్‌లో స్థానం సంపాదించింది. మరో క్వార్టర్స్‌లో వొజ్నియాకి మరింత సులభంగా అనస్తాసియా సెవత్సొవాపై గెలిచింది. ఆమె విజృంభణకు సరైన సమాధానం ఇవ్వలేకపోయిన సెవత్సొవా 0-6, 2-6 తేడాతో ఓటమిపాలైంది.
ఇలావుంటే, ఇప్పటి వరకూ కెర్బర్, వొజ్నియాకి 12 పర్యాయాలు తలపడ్డారు. కెర్బర్ ఏడు విజయాలను నమోదు చేస్తే, వొజ్నియాకి ఐదు మ్యాచ్‌లను గెల్చుకుంది. ర్యాంకుల పరంగా ఇరువురు క్రీడాకారిణుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కెర్బర్ రెండో ర్యాంక్‌లో ఉండగా, వొజ్నియాకి ప్రస్తుతం 74వ స్థానంలో ఉంది. ఇటీవల జరిగిన మ్యాచ్‌ల ఫలితాలను బట్టి చూస్తే, సెమీ ఫైనల్‌లో వొజ్నియాకిపై కెర్బర్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఏదైనా అనూహ్య పరిణామం చోటు చేసుకోకపోతే, కెర్బర్ సెమీస్‌ను సులభంగానే పూర్తి చేసి, ఫైనల్‌లోకి అడుగుపెట్టడం ఖాయం.