క్రీడాభూమి

కష్టాల్లో ఉమర్ అక్మల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జనవరి 6: పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్ కష్టాల్లో చిక్కుకున్నాడు. సుయ్ నార్తన్ గ్యాస్ జట్టుకు దేశవాశీ పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న అతను ఇటీవలే సస్పెన్షన్ వేటు నుంచి తృటిలో బయటపడ్డాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే, ఒక ప్రైవేటు పార్టీకి హాజరై, డాన్స్ చేస్తూ పోలీసు రైడింగ్‌లో పట్టుబడ్డాడు. అయితే, పోలీసులు అతనిపై జాలి చూపించారు. పట్టుబడిన వారిలో ఉమర్ లేడని నివేదిక ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, తాజాగా ఖయిద్ ఎ ఆజమ్ ట్రోఫీలో ఆడుతున్న అతను కోచ్ బాసిత్‌తో ఘర్షణకు దిగాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడంపై బాసిత్ పట్ల ఆగ్రహంతో ఉన్న అతను దుర్భాషలాడాడని చెప్పారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు ఉమర్‌ను దించకుండా ఆల్‌రౌండర్ హుస్సేన్ తలత్‌కు బాసిత్ అవకాశం ఇచ్చాడు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సి రావడంతో ఉమర్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. డే/నైట్ మ్యాచ్ కావడంతో గులాబీ బంతి సరిగ్గా కనిపించకపోవడంతో తాను సరిగ్గా ఆడలేకపోయానని అంటూ బాసిత్‌తో ఉమర్ వాగ్వాదానికి దిగాడని, ఆ సమయంలో సహచరులతోపాటు కొంత మంది సిబ్బంది కూడా డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై అధికారికంగా ఫిర్యాదు అందింతే, ఉమర్‌పై పిసిబి క్రమశిక్షణా కమిటీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.