క్రీడాభూమి

రియోలో పారాలింపిక్స్ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, సెప్టెంబర్ 7: ఏదో ఒక రకమైన అంగ వైకల్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా నిర్వహించే పారాలింపిక్స్ రియో డి జెనీరోలో మొదలయ్యాయి. ఆర్థికంగా పతనావస్థలో ఉన్నప్పటికీ బ్రెజిల్ ఈ క్రీడల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన మూడు వారాల్లోపలే పారాలింపిక్స్‌కు రియో వేదిక కావడం విశేషం. 12 రోజుల పాటు సాగే ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సుమారు 4,300 మంది అథ్లెట్లు టైటిళ్ల కోసం వేటను కొనసాగిస్తారు. ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా), అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపిసి) అధికారులు ఈ పోటీలను విజయవంతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. డోప్ కేసులు నమోదుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.