క్రీడాభూమి

ఓఝా తలకు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయిడా, సెప్టెంబర్ 7: దులీప్ ట్రోఫీలో ఇండియా గ్రీన్ తరఫున ఆడుతున్న స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా తలకు గాయమైంది. ఇండియా బ్లూ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మిడ్ ఆన్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తుండగా అతని తలకు బంతి తగిలింది. శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ పంకజ్ సింగ్ కొట్టిన బంతి ఓఝా సమీపంలో పడి, ఒక్కసారిగా పైకి ఎగిరింది. బంతి దిశను అర్థం చేసుకోలేకపోయిన ఓఝా తలను తప్పించే లోపలే గాయపడ్డాడు. వెంటనే అతనిని సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి స్ట్రెచర్‌పై తరలించారు. వైద్య పరీక్షల నివేదికలు అందిన తర్వాత ఆ గాయం బలమైనదా కాదా అన్నది తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఓఝా తన ఫొటోను ట్వీట్ చేశాడు. తాను బాగానే ఉన్నట్టు సంకేతం పంపాడు.
మ్యాచ్ డ్రా
ఇండియా బ్ల్యూ, ఇండియా గ్రీన్ జట్ల మధ్య జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 769 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గ్రీన్ జట్టు చివరి, నాలుగో రోజు ఆట డ్రాగా ముగిసే సమయానికి 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. అంతకు ముందు బ్లూ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 707 పరుగుల భారీ స్కోరు సాధించింది. మాయాంక్ అగర్వాల్ (161), చటేశ్వర్ పుజారా (166), షెల్డన్ జాక్సన్ (105) శతకాలు నమోదు చేయగా, కెప్టెన్ గౌతం గంభీర్ (90), కర్న్ శర్మ (57) అర్ధ శతకాలు సాధించారు. గ్రీన్ బౌలర్ గోపాల్ 173 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం గ్రీన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకే కుప్పకూలింది. పార్థీవ్ పటేల్ (55), కెప్టెన్ సురేష్ రైనా (52), రాబిన్ ఉతప్ప (41) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యాడు. పర్వేజ్ రసూల్ 16 పరుగులకు మూడు, కర్న్ శర్మ 74 పరుగులకు మూడు చొప్పున వికెట్లు కూల్చారు. తొలి ఇన్నింగ్స్‌లో 470 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించిన బ్లూ రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగులు సాధించింది. మాయాంక్ అగర్వాల్ (58), గౌతం గంభీర్ (59), దినేష్ కార్తీక్ (57), షెల్డన్ జాక్సన్ (79 నాటౌట్) అర్ధ శతకాలు చేశారు.
ఇండియా బ్లూ జట్టు నిర్దేశించిన 769 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యంగా మారగా, సాధ్యమైనంత వరకూ వికెట్లు పడకుండా ఇండియా గ్రీన్ ఆటగాళ్లు ప్రయత్నించారు. చివరికి, మ్యాచ్ డ్రా ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయ 179 పరుగులు చేశారు.