క్రీడాభూమి

యుఎస్ ఓపెన్ 2016 ....జొకోవిచ్, మోన్ఫిల్స్ సెమీస్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 7: యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో ఫ్రెంచ్ వీరుడు గేల్ మోన్ఫిల్స్‌తో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఢీ కొంటాడు. 89 సంవత్సరాల యుఎస్ ఓపెన్ చరిత్రలో మొట్టమొదటిసారి ముగ్గురు ఫ్రెంచ్ ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్స్ చేరడం విశేషం. వీరిలో మెరుగైన స్థానంలో ఉన్న జో విల్‌ఫ్రైడ్ సొంగా క్వార్టర్స్ మ్యాచ్‌ని పూర్తి చేయలేకపోయాడు. జొకోవిచ్‌తో తలపడిన అతను మొదటి సెట్‌ను 3-6 తేడాతో కోల్పోయి, రెండో సెట్‌లో 2-6 తేడాతో వెనుకబడ్డాడు. ఆ దశలో కాలి కండరాలు బెణికి నొప్పి తీవ్రతరం కావడంతో ఆటను కొనసాగించలేక రిటైర్ అయ్యాడు. మరో క్వార్టర్ ఫైనల్స్‌లో మరో ఫ్రెంచ్ ఆటగాడు మోన్ఫిల్స్ 6-4, 6-3, 6-3 స్కోరుతో తన దేశానికే చెందిన లుకాస్ పౌలీని ఓడించి సెమీస్ చేరాడు. ఫైనల్‌లో స్థానం కోసం అతను జొకోవిచ్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
సెర్బియా వీరుడికే
విజయావకాశాలు!
యుఎస్ ఓపెన్‌లో వరుసగా పదోసారి సెమీస్ చేరిన సెర్బియా వీరుడు జొకోవిచ్‌కే ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోన్ఫిల్స్‌తో అతను ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌ల్లో తలపడ్డాడు. అన్నింటిలోనే విజయాలను నమోదు చేశాడు. బలమైన సర్వీసులతో ప్రత్యర్థులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి సంచలన విజయాలను నమోదు చేసే మోన్ఫిల్స్ ఎప్పుడూ జొకోవిచ్‌కు అడ్డుకట్ట వేయలేకపోయాడు. గత ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే, మరోసారి జొకోవిచ్ విజయం ఖాయంగా కనిపిస్తున్నది.