క్రీడాభూమి

ఇంగ్లాండ్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, సెప్టెంబర్ 8: పాకిస్తాన్‌తో జరిగిన ఏకైన టి-20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చిత్తయింది. ఇంకా 31 బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 135 పరుగులు చేసింది. అలెక్స్ హాలెస్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్ వాహబ్ రియాజ్ 18 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ఇమాద్ వసీం, హసన్ అలీ చెరి రెండు వికెట్లు కూల్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 14.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి 139 పరుగులు సాధించింది. షర్జీల్ ఖాన్ 36 బంతుల్లోనే 59 పరుగులు చేసి, అదిల్ రషీద్ బౌలింగ్‌లో మోయిన్ అలీ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అతని స్కోరులో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. 107 పరుగుల వద్ద ఈ వికెట్ కూలింది. అనంతరం బాబర్ ఆజమ్ (15 నాటౌట్)తో కలిసి మరో వికెట్ కూలకుండా ఖలీద్ లతీఫ్ పాక్‌కు విజయాన్ని అందించాడు. అతను 42 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 59 పరుగులు చేశాడు.

చిత్రం.. 36 బంతుల్లోనే 59 పరుగులు చేసిన షర్జీల్ ఖాన్