క్రీడాభూమి

సెమీస్‌కు వావ్రిన్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: స్టానిస్లాస్ వావ్రిన్కా యుఎస్ ఓపెన్ సెమీ ఫైనల్ చేరాడు. రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతను జువాన్ డెల్ పొట్రోను 7-6, 4-6, 6-3, 6-2 తేడాతో ఓడించాడు. 2009లో యుఎస్ ఓపెన్‌ను గెల్చుకున్న పొట్రో ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న వావ్రిన్కాకు ఆశించిన స్థాయిలో పోటీని ఇవ్వలేకపోయాడు. కాగా, ఫైనల్‌లో స్థానం కోసం నిషికోరితో వావ్రిన్కా తలపడతాడు. మరో సెమీ ఫైనల్ ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, ఫ్రెంచ్ ఆటగాడు గేల్ మోన్ఫిల్స్ మధ్య జరుగుతుంది.
టైటిల్ దిశగా సెరెనా
ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఏడోసారి యుఎస్ ఓపెన్ టైటిల్‌ను సాధించే దిశగా మరో అడుగు ముందుకేసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సిమోనా హాలెప్ నుంచి ఎదురైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్న ఆమె 6-2, 4-6, 6-3 తేడాతో విజయం సాధించి, కెరీర్‌లో 23వ గ్రాండ్ శ్లామ్‌ను సాధించే సత్తా తనకు ఉందని నిరూపించింది. యుఎస్ ఓపెన్‌లో చివరిసారి 2014లో టైటిల్‌ను సాధించిన 34 ఏళ్ల సెరెనా ఫైనల్ చేరేందుకు పదో సీడ్ కరోలినా ప్లిస్కోవాతో తలపడుతుంది. అంతకు ముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్‌లో ప్లిస్కోవా 6-2, 6-2 తేడాతో అనా కొన్జూపై సునాయాసంగా గెలిచింది. ఆమె ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే, సెమీస్‌లో సెరెనాకు గట్టిపోటీ తప్పకపోవచ్చని స్పష్టమవుతుంది. కాగా, మరో సెమీ ఫైనల్‌లో రెండో ర్యాంక్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్, మాజీ ప్రపంచ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి ఢీ కొంటారు.

చిత్రం.. స్టానిస్లాస్ వావ్రిన్కా