క్రీడాభూమి

మార్సియా ఆత్మవిశ్వాసానికి ప్రేక్షకుల జేజేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, సెప్టెంబర్ 8: బ్రెజిల్ పారా అథ్లెట్ మార్సియా మాల్సర్ ఆత్మవిశ్వాసానికి వేలాది మంది ప్రేక్షకులు హర్షధ్వానాలతో జేజేలు పలికారు. ఏదో ఒక రకమైన అంగ వైకల్యంతో బాధపడుతున్న క్రీడాకారులకు ఉద్దేశించిన పారాలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుక రియో డి జెనీరోలో ఘనంగా జరిగింది. ఒలింపిక్ క్రీడా జ్యోతిని పట్టుకొని రిలేను కొనసాగించే బాధ్యత మార్సియా తీసుకుంది. అయితే, ఊహించని విధంగా పట్టుతప్పి కిందపడింది. లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, పట్టుదలతో ఆమె తనంతట తానుగానే పైకి లేచింది. రిలేను కొనసాగించింది. టార్చిని అందచేసి, తన బాధ్యతను సమర్థంగా పూర్తి చేసింది.
సంబరాలు.. నినాదాలు..
పారాలింపిక్స్ ప్రారంభమైన మకరానా స్టేడియంలో సంబరాలు జరుగుతుండగా, వెలుపల నిరసనకారుల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఆర్థిక, రాజకీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో సమ్మర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్న వివిధ శాఖల కార్మికులు, ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు, వైద్యులు, విద్యార్థులు కూడా నిరసనలకు దిగారు. సుమారు మూడు వారాల క్రితం ముగిసిన సమ్మర్ ఒలింపిక్స్ సమయంలో నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. పారాలింపిక్స్ సమయంలోనూ అదే దృశ్యం పునరావృతమైంది.
బ్యాచ్ గైర్హాజరు
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) చైర్మన్ థామస్ బ్యాచ్ పారాలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. 1984 తర్వాత పారాలింపిక్స్ ప్రారంభోత్సవానికి ఐఒసి చీఫ్ హాజరుకాకపోవడం ఇదే మొదటిసారి. ఒకప్పటి పశ్చిమ జర్మనీకి అధ్యక్షుడిగా సేవలు అందించిన వాల్టర్ షీల్ మృతి చెందాడని, అతని అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బ్యాచ్ బెర్లిన్‌లోనే ఉండిపోయాడని ఐఒసి వర్గాలు అంటున్నాయి. అయితే, సమ్మర్ ఒలింపిక్స్‌లో చోటు చేసుకున్న టికెట్ల కుంభకోణంపై జర్మనీ పోలీసులు బ్యాచ్‌ను ప్రశ్నించనున్నారని, అందుకే అతను అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని అనధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కారణాలు ఏవైనా, బ్యాచ్ గైర్హాజరు చర్చనీయాంశమైంది.

చిత్రాలు..ఒలింపిక్ టార్చితో మార్సియా మాల్సర్
పట్టుతప్పి కిందపడిన మార్సియా మాల్సర్