క్రీడాభూమి

మైదానంలో అశ్విన్ ఫైట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 9: భారత జాతీయ జట్టు సీనియర్ ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ మైదానంలో సంయమనం కోల్పోయి ఒక యువ క్రికెటర్‌తో యుద్ధానికి దిగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చేపాక్ సూపర్ గిల్లీస్, దిండిగల్ డ్రాగాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దిండిగల్ కెప్టెన్ అశ్విన్‌తోపాటు జగదీశ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సాయి కిషోర్ బౌలింగ్‌లో జగదీశ్ అవుటైన తర్వాత ఘర్షణ చోటు చేసుకుంది. పెవిలియన్‌కు వెళుతున్న జగదీశ్‌పై సాయి కిషోర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో, నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న అశ్విన్ తీవ్రంగా స్పందించాడు. సాయి కిషోర్‌ను బలంగా వెనక్కు నెట్టాడు. ఒక దశలో బ్యాట్ ఎత్తి కొట్టడానికి సిద్ధమయ్యాడు. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.