క్రీడాభూమి

శ్రీలంకతో రెండో టి-20 ఆసీస్ అలవోక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, సెప్టెంబర్ 9: శ్రీలంకతో శుక్రవారం జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సు నాయాసంగా గెలిచింది. 129 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయ ఛేదించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన లంక తొలుత బ్యాటింగ్ కు దిగింది. అయతే, అది పొరపాటు నిర్ణయమని వికెట్ల పతనం స్పష్టం చేసింది. ధనంజయ డి సిల్వ 62 పరుగులు సాధించకపోతే, లంక మరింత కష్టాల్లో పడి ఉండేది. అతనితోపాటు కుశాల్ పెరెరా (22) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ వద్దే ఆగిపోవడంతో, లం క 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో జేమ్స్ ఫాల్క్‌నర్ 19 పరు గులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ఆడం జంపా 16 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు కెప్టెన్ డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్ శుభారంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కు 93 పరుగులు జోడించిన తర్వాత, 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వ ద్ద వార్నర్ అవుటయ్యాడు. కేవలం 29 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 66 పరుగులు చేసి, ఆసీస్ విజయానికి బాటలు వేసిన మాక్స్‌వెల్ సెకండ్ డౌన్‌గా పెవిలియన్ చేరాడు. ఆతర్వాత పరుగు ల వేటలో ఆసీస్ వికెట్లు కోల్పోయ నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరో 13 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.