క్రీడాభూమి

పరాజయాలకు కారణాలెన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: రియో ఒలింపిక్స్‌లో భారత బృందం దారుణ వైఫల్యాలను ఎదుర్కోవడానికి ఎన్నో కారణాలున్నాయని కేంద్రానికి సమర్పించనున్న నివేదికలో క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) పేర్కొంది. రియోలో 117 మంది పోటీపడినప్పటికీ, కేవలం రెండు పతకాలు మాత్రమే దక్కిన విషయం తెలిసిందే. మహిళల బాడ్మింటన్‌లో పివి సింధు రజత పతకాన్ని, మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని అందుకోగా, మిగతా వారంతా నిరాశ పరిచారు. ఈ వైఫల్యాలపై వివరణనిస్తూ, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు చేయాల్సిందిగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అటు అథ్లెట్లను, ఇటు జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలను కోరింది. కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ అందరికీ పేరుపేరున లేఖలు రాసి, వివరాలు సమర్పించాలని కోరారు. దీనిపై సాయ్ స్పందించింది. ఫిట్నెస్ సమస్య భారత్ వైఫల్యాలకు ప్రధాన కారణమని సాయ్ తన నివేదికలో పేర్కొంది. సైనా నెహ్వాల్ మోకాలి గాయంతోనే రియో వెళ్లిందని, అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆమెకు శస్త్ర చికిత్స జరిగిందని సాయ్ గుర్తుచేసింది. వైఫల్యాలకు ఫిట్నెస్ సమస్య ఒక కారణమైతే, చాలా మంది అథ్లెట్లు పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోవడం మరో కారణమని పేర్కొన్నది. షూటర్ అభినవ్ బింద్రా, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పతకాలను తృటిలో కోల్పోయారని తెలిపింది. అదే విధంగా రెజ్లర్ వినేష్ ఫొగట్ గాయపడడంతో ఒక పతకం చేజారిందని తెలింది. కోచ్‌లు, ప్రత్యేకించి విదేశీ కోచ్‌ల సేవలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించింది. చాలా క్రీడలకు మన దేశంలో ఆదరణ లేకపోవడాన్ని కూడా సాయ్ ప్రస్తావించింది. స్విమ్మింగ్, ట్రయథ్లాన్, ఫెన్సింగ్, జూడో, తైక్వాండో వంటి ఈవెంట్స్‌లో మన దేశం తరఫున పోటీ నామమాత్రమేనని వ్యాఖ్యానించింది. రికార్డు స్థాయిలో వందకుపైగా అథ్లెట్లు ఒలింపిక్స్‌కు అర్హత దక్కించుకోవడాన్ని చూస్తే పరిస్థితి ఆశాజనకంగానే ఉందని పేర్కొంది. అయితే, పతకాలు సాధించే స్థాయి ప్రమాణాలను అందుకోవాలంటే మరింత ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడింది.