క్రీడాభూమి

రియోలో మరో ఫెల్ప్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, సెప్టెంబర్ 9: సుమారు మూడు వారాల క్రితం రియో ఈత కొలనులో అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ప్రకటనలు సృష్టించాడు. ఐదు స్వర్ణాలను, ఒక రజత పతకాన్ని గెల్చుకొని తనకు తిరుగులేదని నిరూపించాడు. ఇప్పుడు పారాలింపిక్స్ జరుగుతుండగా, స్విమ్మింగ్ పూల్‌లో మరో ఫెల్ప్స్ దర్శనమిస్తున్నాడు. 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఎస్-5 విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన బ్రెజిల్ పారాస్విమ్మర్ డానియల్ డయాస్ మరికొన్ని టైటిళ్లను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పారాలింపిక్స్‌లో అతనికి ఇది 16వ పతకం. అమెరికా స్విమ్మర్ రాయల్ పెర్కిన్స్‌ను పది సెకన్ల తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించిన 28 డయాస్ తనను ఫెల్ప్స్‌తో పోల్చవద్దని అంటున్నాడు. ‘నా పేరు డానియల్ డయాస్. నాకు నేను ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఫెల్ప్స్‌తో పోల్చడం ఆనందంగా ఉన్నా, నా ఉనికిని నేను కాపాడుకుంటాను’ అన్నాడు. మరో ఎనిమిది విభాగాల్లో పోటీపడనున్న డయాస్ మొత్తం మీద పారాలింపిక్స్‌లో 24 పతకాలు సాధించి, సరికొత్త రికార్డును నెలకొల్పే అవకాశాలున్నాయి. పురుషుల్లో అత్యధికంగా ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ కౌడ్రే 23 పతకాలు గెల్చుకున్నాడు. రియో పారాలింపిక్స్ ముగిసే సమయానికి డయాస్ ఆ రికార్డును అధిగమించే అవకాశాలున్నాయి. అయితే, ఈ పోటీల్లో ఎక్కువ పతకాలు సాధించిన ఘనత అమెరికా స్విమ్మర్ ట్రిషా జోమ్‌కు దక్కుతుంది. ఆమె 41 స్వర్ణాలుసహా మొత్తం 55 పతకాలను కైవసం చేసుకుంది. వీటిలో తొమ్మిది రజతం, ఐదు కాంస్య పతకాలున్నాయి.
పవర్‌లిఫ్టింగ్‌లో బాషాకు నాలుగో స్థానం
పురుషుల 49 కిలోల పవర్‌లిఫ్టింగ్ విభాగంలో భారత లిఫ్టర్ ఫర్మాన్ బాషా నాలుగో స్థానంలో నిలిచాడు. మొత్తం 140 కిలోల బరువునెత్తిన అతను తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో షూటర్ నరేష్ కుమార్ శర్మ ఫైనల్స్‌కు క్వాలిఫై కాలేకపోయాడు. డిస్కస్‌త్రో విభాగంలో మొత్తం ఏడుగురు పోటీపడగా, అమిత్ కుమార్ సరోహా చివరి స్థానానికి పరిమితమయ్యాడు.