క్రీడాభూమి

కెర్బర్ టైటిల్ వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 9: సెరెనాను రెండో స్థానంలోకి నెట్టి, ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన ఏంజెలిక్ కెర్బర్ మరో గ్రాండ్ శ్లామ్ టైటిల్ వేటను కొనసాగిస్తున్నది. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో మాజీ ప్రపంచ నంబర్ వన్ కారోలిన్ వొజ్నియాకిని ఆమె 6-4, 6-3 తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. టైటిల్ కోసం కరోలినా ప్లిస్కోవాతో ఫైనల్ పోరును ఖాయం చేసుకుంది. ఈఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్‌ను సాధించిన కెర్బర్ ఆతర్వాత వింబుల్డన్‌లో ఫైనల్ చేరింది. కానీ, సెరెనా చేతిలో ఓటమిపాలై, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది. యుఎస్ ఓపెన్‌లో మరోసారి అద్వితీయ ప్రతిభ కనబరుస్తూ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. 1996లో స్ట్ఫె గ్రాఫ్ తర్వాత ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి జర్మనీ క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 74వ స్థానంలో ఉన్న వొజ్నియాకి ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోవడంతో కెర్బర్ పోరు నల్లేరుపై నడకలా సాగింది. కెరీర్‌లో మొదటిసారి ఒక గ్రాండ్ శ్లామ్ ఫైనల్ చేరిన ప్లిస్కోవాను ఫైనల్‌లో కెర్బర్ ఓడిస్తుందా లేక సెరెనా ఓటమి మాదిరిగానే అనూహ్య ఫలితం వెల్లడవుతుందా అన్నది ఆసక్తి రేపుతోంది.