క్రీడాభూమి

అమీర్‌కు పిసిబి అండ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జనవరి 6: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అనుసరిస్తున్న వైఖరి పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇంగ్లాండ్ టూర్‌లో బుకీలతో కుమ్మక్కయి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన అప్పటి కెప్టెన్ సల్మాన్ బట్, ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ అమీర్‌లపై సస్పెన్షన్ వేటును విధించిన పిసిబి ఇప్పుడు వారి విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నది. అమీర్‌ను మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోవడానికి చాలా కష్టపడింది. మొదట అతనిని పునరావాస కేంద్రానికి పంపింది. అనంతరం అతనిని దేశవాళీ పోటీలకు అనుమతించింది. అతని ప్రవర్తన సక్రమంగా లేకపోయినా హెచ్చరికతో వదలిపెట్టింది. తాజాగా న్యూజిలాండ్ టూర్‌కు ఎంపిక చేసిన జట్టులో అతనికి స్థానం కల్పించింది. అమీర్‌కు అండగా నిలిచిన పిసిబి బట్, ఆసిఫ్‌పై నాన్పుడు ధోరణిని ప్రదర్శిస్తున్నది. వారిద్దరి పునరాగమనం ఇప్పట్లో సాధ్యం కాదని పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్ హరూన్ రషీద్ ప్రకటించాడు. ఈనెల 10 నుంచి జరిగే జాతీయ వనే్డ చాంపియన్‌షిప్ పోటీలకు వీరిద్దరూ మళ్లీ దేశవాళీ పోటీల్లో పాల్గొంటారని బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. కానీ, వీరు జాతీయ జట్టులోకి రావడం ఇప్పట్లో సాధ్యంకాదని వ్యాఖ్యానించాడు. ఒకే కేసులో దోషులుగా తేలిన వారి పట్ల పిసిబి పరస్పర విరుద్ధంగా ప్రవర్తించడం వివాదానికి కారణమవుతున్నది. అమీర్‌కు జాతీయ జట్టులో స్థానం కల్పించిన పిసిబిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి, జైలు జీవితాన్ని గడిపి, సస్పెన్షన్‌కు గురై, పునరావాస శిక్షణ పొందిన అమీర్‌పై ఇటీవలే ఖాద్ ఎ ఆజామ్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా పిఐఎతో జరిగిన మ్యాచ్‌లో సుయ్ సదరన్ గాస్ జట్టు తరఫున ఆడాడు. ఆట మధ్యలో పిఐఎ ఆటగాళ్లతో ఘర్షణకు దిగడమేగాక, వారిని దుర్భాషలాడాడు. టెస్టు క్రికెటర్ ఫైజర్ ఇక్బాల్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అమీర్ వ్యవహార శైలిపై పిసిబి మండిపడింది. అతని మ్యాచ్ ఫీజుకు 150 శాతాన్ని జరిమానాగా విధించింది. క్రమశిక్షణ రాహిత్యాన్ని క్షమించేది లేదని స్పష్టం చేసింది. సస్పెన్షన్ వేటు పడిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అయతే, ఇదంతా ఉత్తుత్తి నాటకమేనని, అమీర్‌కు బోర్డు అండగా ఉందని చెప్పడానికి అతనిని జాతీయ జట్టుకు ఎంపిక చేయడమే నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు.
తీవ్ర వత్తిడి ఖాయం
త్వరలో న్యూజిలాండ్‌లో జరుగనున్న పరిమిత ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో కళంకిత పేస్ బౌలర్ మహ్మద్ అమీర్ బరిలోకి దిగితే అతను తీవ్రమైన వత్తిడికి లోనవడం ఖాయమని పాకిస్తాన్ మాజీ టెస్టు క్రికెటర్ రమీజ్ రాజా స్పష్టం చేశాడు. 2010లో యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో దోషిగా తేలి ఐదేళ్ల నిషేధంతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన అమీర్‌ను పాక్ జాతీయ సెలెక్టర్లు శుక్రవారం న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేయడంతో అమీర్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పాక్ జట్టులోకి మళ్లీ అమీర్‌ను అనుమతించడాన్ని రమీజ్ రాజా తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే పాక్ రెండు జట్లలో అమీర్‌కు చోటు కల్పించడం తనకు ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదని రమీజ్ శుక్రవారం తెలిపాడు. ‘అమీర్‌కు రెండోసారి అవకాశం ఇవ్వాలని పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఇప్పటికే విధాన నిర్ణయం తీసుకున్నందున అతనికి మళ్లీ జాతీయ జట్టులో చోటు లభించడం ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కానీ అమీర్ మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లోకి దిగితే అతను తీవ్రమైన వత్తిడికి లోనవడం ఖాయం. దీనిని అధిగమించి అతను ఏవిధంగా రాణిస్తాడో వేచిచూడాల్సిందే’ అని రమీజ్ రాజా అన్నాడు. అమీర్ ఇంతకుముందు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడినప్పటి నుంచి ఇప్పటివరకూ క్రికెట్ ఎంతగానో మారిపోయిందని, అంతర్జాతీయ వనే్డలు, ట్వంటీ-20 మ్యాచ్‌లలో ఎన్నో మార్పులు వచ్చాయని, మారిన పరిస్థితులకు అనుగుణం గా వత్తిడిని అధిగమించి ఎలా ముందుకు సాగుతాడన్నది అనుమానమన్నాడు.