క్రీడాభూమి

సందీప్ చేజారిన పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: జావెలిన్ త్రో ఎఫ్-44 విభాగంలో భారత అథ్లెట్ సుందీప్ కాంస్య పతకాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. అతను నాలుగో స్థానంలో నిలిస్తే, మరో త్రోయర్ నరేందర్ రణ్‌బీర్‌కు ఆరో స్థానం దక్కింది. 20 ఏళ్ల సందీప్ జావెలిన్‌ను 54.30 మీటర్ల దూరం విసిరాడు. ఇది అతని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన. అయితే, కాంస్య పతకాన్ని అతను 0.69 మీటర్ల తేడాతో కోల్పోయాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన స్టివర్ట్ అకీన్ 57.32 మీటర్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, అలిస్టర్ మెక్‌క్వీన్ (కెనడా) 55.56 మీటర్ల దూరానికి విసిరి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. న్యూజిలాండ్ అథ్లెట్ రోరి మెక్‌స్వీనీ 54.99 మీటర్ల దూరంతో కాంస్య పతకాన్ని సాధించాడు. సందీప్ 54.30 మీటర్లు, నరేందర్ 53.79 మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసరగలిగారు.