క్రీడాభూమి

క్రికెటర్ ప్రవీణ్ కొత్త ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 11: క్రికెటర్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ద్వారా తన జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ఉత్తర ప్రదేశ్ మఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలుసుకొని, చర్చించిన తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు అతను తెలిపాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు అతను నేరుగా సమాధానం చెప్పలేదు. రాజకీయాల్లోకి ఇప్పుడే అడుగుపెట్టానని, ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని అన్నాడు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని చెప్పాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఉత్తర ప్రదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రవీణ్ ఆల్‌రౌండర్ హోదాలో టీమిండియా తరఫున ఆరు టెస్టులు ఆడి 27 వికెట్లు పడగొట్టాడు. 68 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 77 వికెట్లు సాధించాడు.

భారత్ ‘ఎ’ ఓటమి

బ్రిస్బేన్, సెప్టెంబర్ 11: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన నాలుగు రోజుల అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ‘ఎ’ ఏడు వికెట్లకు 161 పరుగులు చేసి, విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా ఆస్ట్రేలియా ‘ఎ’ 228 పరుగులకు ఆలౌటైంది. రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. విజయం సాధించాలంటే 159 పరుగుల చేయాల్సి ఉండగా, ఆస్ట్రేలియా ‘ఎ’ 57.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరింది. కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ అజేయంగా 58 పరుగులు చేసి, ఆస్ట్రేలియా ‘ఎ’ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్ శార్దూల్ ఠాకూర్ 42 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.