క్రీడాభూమి

మా వాటాను వదులుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ శశాంక్ మనోహర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఐసిసి నుంచే వచ్చే వాటాను వదులుకునే ప్రసక్తే లేదని ఠాకూర్ తేల్చిచెప్పడం ఇప్పుడు మనోహర్‌ను ఇరకాటంలోకి నెట్టింది. ఐసిసి ఆర్థిక అంశాలన్నీ ‘బిగ్ త్రీ’గా పిలిచే భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలకే అప్పగిస్తూ శ్రీనివాసన్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని మనోహర్ ఇప్పటికే ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే, మనోహర్ వ్యవహార శైలిని ఠాకూర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ‘బిగ్ త్రీ’ విధానం వల్ల క్రికెట్ పట్ల మిగతా దేశాలకు ఆసక్తి తగ్గుతుందని మనోహర్ చేసిన వ్యాఖ్యలను ఠాకూర్ తిప్పికొట్టాడు. ఆర్థికంగా బలంగా ఉన్న బిసిసిఐ లాంటి క్రికెట్ బోర్డులు ఐసిసి నుంచి తీసుకుంటున్న సింహభాగం వాటాలను వదులుకోవాలంటూ మనోహర్ చేసిన విజ్ఞప్తిని కూడా ఠాకూర్ తిరస్కరించాడు. బిసిసిఐకి వచ్చే వాటాలో ఒక్క రూపాయిని కూడా వదులుకోబోమని తేల్చిచెప్పాడు. ఐసిసిని ‘బిగ్ త్రీ’ దేశాల ఆధిపత్యం నుంచి విడిపించి, గతంలో మాదిరిగానే కార్యకలాపాలను నిర్వహించాలన్న మనోహర్ ప్రయత్నాలు బిసిసిఐ మద్దతు ఉంటుంటేనే సఫలమవుతాయి. కానీ, భారత్ నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడం అతనిని ఆత్మరక్షణలోకి నెట్టింది. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు భారీ వాటాలను వదులుకోవాలని మనోహర్ సూచిస్తుంటే ఠాకూర్ ససేమిరా అంటున్నాడు. వాటాలను వదులుకునే ప్రసక్తే లేదని అతను స్పష్టం చేయడంతో, మిగతా రెండు దేశాల క్రికెట్ బోర్డులు కూడా మనోహర్ ప్రతిపాదనను వ్యతిరేకించే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో తన ప్రతిపాదనలకు ఏ విధంగా ఆమోద ముద్ర వేయించుకోవాలో అర్థంగాక మనోహర్ మల్లగుల్లాలు పడుతున్నాడు. మొత్తం మీద ఐసిసిలో ‘బిగ్ త్రీ’ ఆధిపత్యానికి చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతుంటే, మనోహర్, ఠాకూర్ మధ్య మాటల యుద్ధం జోరందుకుంది.