క్రీడాభూమి

యుఎస్ రాణి కెర్బర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 11: జర్మనీ టెన్నిస్ స్టార్ ఏంజెలిక్ కెర్బర్ యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె చెక్ రిపబ్లిక్‌కు చెందిన పదోసీడ్ కరోలినా ప్లిస్కోవాను 6-3, 4-6, 6-4 తేడాతో ఓడించి, కెరీర్‌లో రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సంపాదించుకోవడమేగాక, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకుంది. ఈఏడాది మూడోసారి గ్రాండ్ శ్లామ్ ఫైనల్ చేరిన 28 ఏళ్ల ఎడమచేతి వాటం క్రీడాకారిణి కెర్బర్ ఒక సెట్‌ను కోల్పోయినప్పటికీ, టైటిల్ సాధించడంలో పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకపోయింది. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో సెరెనా విలియమ్స్‌ను ఓడించింది. ఆతర్వాత వింబుల్డన్‌లోనూ ఫైనల్ చేరింది. కానీ, సెరెనా చేతిలో పరాజయాన్ని చవిచూసి, రన్నర్ ట్రోఫీని స్వీకరించింది. యుఎస్ ఓపెన్‌లో సిసి బెలిస్, పెట్రా క్విటోవా, రాబర్టా విన్సీ వంటి సమర్థులను ఓడించి సెమీస్ చేరింది. ఫైనల్‌లో స్థానం కోసం ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకిని ఢీకొనాల్సి వచ్చినప్పటికీ ఏమాత్రం తడబడలేదు. ప్రత్యర్థి బలమైన సర్వీసులను తిప్పికొడుతూ, పాయింట్లు కొల్లగొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వొజ్నియాకిని సునాయాసంగా ఓడించి ఫైనల్‌లో స్థానం సంపాదించింది. టైటిల్ పోరులో కెర్బర్‌దే పైచేయి అవుతుందని క్రీడా పండితులు మ్యాచ్‌కి ముందే జోస్యం చెప్పారు. వారి అంచనాలు సరైనవేనని నిరూపిస్తూ ప్లిస్కోవాను ఓడించిన కెర్బర్ టైటిల్‌ను అందుకుంది.
ఒత్తిడికి గురైన చెక్ స్టార్
చెక్ రిపబ్లిక్ స్టార్‌గా ఎదిగిన ప్లిస్కోవా ఫైనల్‌లో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టు ఆమె ఆటతీరు స్పష్టం చేసింది. అనస్తాసియా పవ్లిచెన్కోవా, వీనస్ విలియమ్స్, కొన్జూ నుంచి ఎదురైన సవాళ్లకు తగిన సమాధానం చెప్తూ సెమీస్ చేరుకున్న ప్లిస్కోవా ఫైనల్‌లో స్థానం సంపాదించే క్రమంలో ప్రపంచ నంబర్ వన్ సెరెనాతో తలపడింది. కెరీర్‌లో 22 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించి, అసాధారణ ఫామ్‌లో ఉన్న సెరెనాకు ప్లిస్కోవా గట్టిపోటీనిస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. టైటిల్ రేసులో అందరి కంటే ముందు ఉండి, హాట్ ఫేవరిట్ ముద్ర వేయించుకున్న సెరెనాను వరుస సెట్లలో ఓడించడంతో ప్లిస్కోవా పేరు టెన్నిస్ ప్రపంచంలో మారుమోగింది. ఫైనల్‌లో ఆమె అదే స్థాయిలో కెర్బర్‌పై విరుచుకుపడుతుందని అభిమానులు ఆశించారు. వారి అంచనాలకు తగినట్టు ఆడకపోయినా, మొత్తం మీద గట్టిపోటీనిచ్చిన ప్లిస్కోవా టైటిల్ పోరును మూడు సెట్ల వరకూ తీసుకెళ్లింది. గత 17 గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో ఎన్నడూ మూడో రౌండ్‌ను కూడా దాటని ఆమె ఈసారి రన్నరప్‌గా నిలవడం విశేషం. ఫైనల్‌లో ఓడినప్పటికీ, తనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నిరూపించింది.