క్రీడాభూమి

356 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయిడా, సెప్టెంబర్ 12: దులీప్ ట్రోఫీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా రెడ్ 356 పరుగులకు ఆలౌటైంది. ఇండియా బ్లూ మొదటి ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్లకు 693 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా రెడ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 16 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి 356 పరుగులకు కుప్పకూలింది. గుర్‌కీరత్ సింగ్ (57), స్టువర్ట్ బిన్నీ (98), అమిత్ మిశ్రా (65), కుల్దీప్ యాదవ్ (59) అర్ధ శతకాలు సాధించినప్పటికీ, 337 పరుగులు వెనుకబడింది. ఇండియా బ్లూ బౌలర్ రవీంద్ర జడేజా 95 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టా డు. పంకజ్ సింగ్, కర్న్ శర్మ చెరి రెండు వికెట్లు సాధించారు.
కాగా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన ఇండియా బ్లూ రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా ఒక పరుగు చేసింది.గౌతం గంభీర్ (1), మాయాంక్ అగర్వాల్ (0) క్రీజ్‌లో ఉన్నారు.