క్రీడాభూమి

స్నేహితుల్ని కోల్పోయా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 12: జాతీయ సెలక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎన్నో కఠిన నిర్ణయాలను తీసుకున్నానని, ఫలితంగా ఎంతో మంది స్నేహితుల్ని కోల్పోయానని సందీప్ పాటిల్ వాపోయాడు. 2012లో మహేందర్ అమర్‌నాథ్‌పై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ కమిటీ (బిసిసిఐ) అతని స్థానంలో పాటిల్‌ను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. అప్పటి నుంచి నేటి వరకూ భారత క్రికెట్‌కు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేశానని పిటిఐతో మాట్లాడుతూ పాటిల్ అన్నాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని అన్నాడు. సచిన్ తెండూల్కర్ ఫామ్‌ను కోల్పోయినందుకు తప్పనిసరి పరిస్థితుల్లో రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందా అన్న ప్రశ్నకు పాటిల్ నేరుగా సమాధానం చెప్పలేదు. ఒకానొక దశలో రిటైర్ కావాలని సచిన్‌పై పాటిల్ ఒత్తిడి తెచ్చాడని, లేకపోతే బలవంతంగా జట్టు నుంచి ఉద్వాసన పలకాల్సి వస్తుందని హెచ్చరించాడని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రస్తావించగా, సమాధానం చెప్పేందుకు పాటిల్ నిరాకరించాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నానని, అందుకే కొంత మంది స్నేహితులను దూరం చేసుకోవాల్సి వచ్చిందని అన్నాడు. సెలక్టర్‌గా తనకు ఈ అవకాశం ఇచ్చిన బిసిసిఐకి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని చెప్పిన పాటిల్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన జట్టును సమర్థించాడు. తన దృష్టిలో ఇది అత్యుత్తమ జట్టని అన్నాడు. సోమవారం జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో తనతోపాటు కమిటీ సభ్యులు సాబా కరీం, విక్రం రాథోడ్ కూడా పాల్గొన్నారని చెప్పాడు. మరో ఇద్దరు సెలక్టర్లు, గగన్ ఖోడా, ఎంఎస్‌కె ప్రసాద్ ఆస్ట్రేలియా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలను తెలిపారని అన్నాడు. సమావేశానికి బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనీల్ కుంబ్లే కూడా హాజరయ్యారని, అందరూ ఏకగ్రీవంగా జట్టును ఎంపిక చేశామన్నాడు.