క్రీడాభూమి

సెలక్టర్లు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 12: పురుషులు, మహిళల విభాగాలతోపాటు జూనియర్స్ విభాగంలోనూ సెలక్టర్లు కావాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. అర్హతలను కూడా విస్పష్టంగా పేర్కొంది. ఈ మూడు విభాగాల్లోనూ ప్రస్తుత సెలక్షన్ కమిటీల పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో బిసిసిఐ ఈ ప్రకటన విడుదల చేసింది. సెలక్టర్లుగా దరఖాస్తు చేసుకునే వారు భారత్ తరఫున కనీసం ఒక టెస్టు లేదా వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి ఉండాలని పేర్కొంది. లేదా కనీసం 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలని స్పష్టం చేసింది. గతంలో సెలక్టర్లుగా నాలుగు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసిన వారు మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని తెలిపింది. కనీసం ఐదు సంవత్సరాల క్రితమే అన్ని ఫార్మెట్స్‌లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన వారు మాత్రమే అర్హులని తెలిపింది. అంతేగాక, 60 సంవత్సరాల లోపు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఒకవేళ ఎంపికైతే వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని బిసిసిఐ ఆ ప్రకటనలో పేర్కొంది. పరస్పర ప్రయోజనాల విషయంలో సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో, దరఖాస్తుదారులకు ఐపిఎల్ జట్లతో లేదా యాజమాన్యాలతో లేదా ప్రపంచ వ్యాప్తంగా ఇతరత్రా లీగ్‌లతో ఎలాంటి సంబంధం ఉండరాదని తేల్చిచెప్పింది. ప్రత్యక్షంగాగానీ లేదా పరోక్షంగాగానీ ఏ రకమైన సంబంధం ఉన్నా, వారిని అనర్హులుగా పరిగణిస్తామని బిసిసిఐ స్పష్టం చేసింది.