క్రీడాభూమి

స్వప్నం.. సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డీ జెనిరో, సెప్టెంబర్ 13: నడుము నుంచి కింది భాగమంతా చచ్చుబడిపోయి, 31 ఆపరేషన్లు, 183 కుట్లు పడిన తర్వాత వీల్‌చైర్‌కే పరిమితమైన వాళ్లు ఏం సాధిస్తారని ఎవరైనా అనుకుంటారు. అది కూడా 45 ఏళ్ల వయసు వచ్చాక ఇక సాధించడానికి ఏముంటుంది? అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే తాను కలలు కనడానికి సాహసించానని, వాటిని సాకారం చేసుకోవడానికి ఎంతో శ్రమించానని పారాలింపిక్స్‌లో తొలి పతకం సాధించిన మహిళగా రికార్డు సృష్టించిన దీపా మలిక్ అంటోంది. రియో పారాలింపిక్స్‌లో షాట్‌పుట్‌లో 4.61 మీటర్ల దూరం గుండు విసిరి దీపా మలిక్ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. బహ్రేన్‌కు చెందిన ఫాతెమా నెధమ్ 4.76 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం సాధించగా, గ్రీస్‌కు చెందిన దిమిత్రా కోరోకిడా 4.28 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం సాధించింది. రియోలో భారత్‌కు మూడో పతకాన్ని అందించిన దీపది స్ఫూర్తిదాకమైన జీవితం. వెనె్నముకలో కణితి కారణంగా ఛాతీనుంచి కింది భాగమంతా చచ్చుబడి పోవడంతో గత 17 ఏళ్లుగా ఆమె వీల్‌చైర్‌కే పరిమితమై ఉంది. 31 ఆపరేషన్లు, 183 కుట్లు.. అన్నీ జరిగినా తాను ఇక ఎప్పటికీ నడవలేనని తెలిసినా ఆమె ఏమాత్రం అధైర్య పడలేదు. కార్గిల్ యుద్ధంలో పాల్గొని విజయవంతంగా తిరిగి వచ్చిన భర్తనే స్ఫూర్తిగా తీసుకుంది ఇద్దరు పిల్లల తల్లయిన దీప. 36 ఏళ్ల వయసులో ఆమె స్విమ్మింగ్, రేసింగ్, అథ్లెటిక్స్‌లాంటి రంగాల్లో రాణించాలని నిర్ణయించుకుంది. అత్యంత క్లిష్టమైన హిమాలయన్ బైక్ రేస్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. బైక్ రైడింగ్‌లో నాలుగు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను సొంతం చేసుకున్న దీప స్విమ్మింగ్‌లోను ఎన్నో పతకాలు సాధించింది. అయితే ఆ తర్వాత 2009లో ఆమె అథ్లెటిక్స్‌వైపు మొగ్గు చూపింది. జావెలిన్ త్రో, షాట్‌పుట్‌లపై దృష్టిపెట్టిన ఆమె రియో పోటీలకు ముందు దోహాలో జరిగిన ఐపిసి ఓసియానా ఆసియన్ చాంపియన్‌షిప్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం, షాట్‌పుట్‌లో రజత పతకం సాధించింది. అంతకుముందు ఇంచియాన్‌లో జరిగిన పారా ఏసియన్ గేమ్స్‌లోను పతకం సాధించింది. అంతేకాదు 2012లో భారత ప్రభుత్వంనుంచి అర్జున అవార్డును సైతం అందుకుంది. రియోలో పతకం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన దీప, దేశానికి పతకం సాధించినందుకు ఇంకా ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఈ పథకం సాధించేందుక తనకు సహకరించిన కోచ్‌లకు, ట్రైనర్లకు, సాయ్‌కి, తన శిక్షణకు నిధులిచ్చిన క్రీడల మంత్రిత్వ శాఖకు తాను నిజంగా రుణ పడి ఉన్నానని చెప్పింది. కాగా, తన విజయం మరెందరి స్ఫూర్తిదాయకం అవుతుందని ఆశిస్తున్నానని చెప్పింది.
హర్యానా సిఎం అభినందన
పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన దీపా మాలిక్‌కు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అభినందనలు తెలియజేశారు. బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో ఆమె 4.61 మీటర్ల దూరం షాట్‌పుట్‌ను విసిరి రజత పతకాన్ని కైవసం చేసుకున్న విషయం విదితమే. దీంతో దీపా మాలిక్‌ను అభినందిస్తూ హర్యానా ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. రియోలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన దీపా మాలిక్ కేవలం హర్యానా రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచిందని మనోహర్‌లాల్ కొనియాడారు. ‘రియోలో ఇటీవల ముగిసిన ఒలింపిక్ క్రీడల్లో రెజ్లర్ సాక్షి మాలిక్ దేశానికి తొలి పతకాన్ని అందించగా, ఇప్పుడు పారాలింపిక్స్‌లో పతకాన్ని గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా దీపా మాలిక్ చరిత్ర సృష్టించింది. దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన వీరిద్దరూ హర్యానా ముద్దుబిడ్డలు కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అని మనోహర్‌లాల్ పేర్కొన్నారు. దీపా మాలిక్‌కు ప్రస్తుతం హర్యానాలో అనుసరిస్తున్న నూతన క్రీడా విధానం ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేయనుంది.