క్రీడాభూమి

పారాలింపియన్ల సంచలనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డీ జెనిరో, సెప్టెంబర్ 13: పారాలింపిక్స్ పురుషుల టి-13 క్లాస్ 1,500 మీటర్ల రేసులో పోటీపడిన అథ్లెట్లలో నలుగురు అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ సంభ్రమాశ్చర్యాకు గురి చేశారు. రియో ఒలింపిక్స్‌లో ఇదే ఈవెంట్‌లో పసడి పతకాన్ని కైవసం చేసుకున్న అథ్లెట్ కంటే తక్కువ సమయంలో 1,500 మీటర్ల రేసును పూర్తిచేసి ఈ నలుగురు పారాలింపియన్లు సంచలనం సృష్టించారు. గత నెలలో ముగిసిన రియో ఒలింపిక్స్ 1,500 మీటర్ల పరుగులో అమెరికా అథ్లెట్ మాథ్యూ సెంట్రోవిట్జ్ 3:50:00 నిమిషాల వ్యవధిలో లక్ష్యాన్ని అధిగమించి స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, ప్రస్తుతం రియోలో జరిగిన పారాలింపిక్స్ 1,500 మీటర్ల రేసులో కంటి చూపు లేకపోయినప్పటికీ నలుగురు అథ్లెట్లు సెంట్రోవిట్జ్ కంటే తక్కువ సమయంలో లక్ష్యాన్ని అధిగమించి అతని విజయానికి ఏమాత్రం విలువ లేకుండా చేశారు.
వీరిలో అల్జీరియాకు చెందిన ఫావద్ బకా 3:49:84 నిమిషాల్లో 1,500 మీటర్ల రేసును పూర్తిచేసి ఒలింపిక్ పసిడి పతక విజేత కంటే 16 మిల్లీ సెకన్ల ముందే లక్ష్యాన్ని అధిగమించినప్పటికీ పోడియంపై అతనికి చోటు లభించకపోవడం గమనార్హం. కెన్యాకు చెందిన హెన్రీ కిర్వా 3:49:84 నిమిషాల వ్యవధిలో ఈ రేసును పూర్తిచేసి కాంస్య పతకాన్ని, ఇథియోపియా అథ్లెట్ తమిరు డెమిస్సీ (3:48:59 నిమిషాలు) రజత పతకాన్ని గెలుచుకోగా, ఫావద్ బకా సోదరుడు అబ్దెల్లతీఫ్ బకాను పసిడి పతకం వరించింది. ఈ రేసును 3:48:29 నిమిషాల్లో ముగించి సెంట్రోవిట్జ్ కంటే ఒకటిన్నర సెకను కంటే ముందే లక్ష్యాన్ని చేరిన అబ్దెల్లతీఫ్ బకా టి-13 క్లాస్ 1,500 మీటర్ల ఈవెంట్‌లో ప్రపంచ రికార్డుతో సత్తా చాటుకోవడం విశేషం. అతను సాధించిన ఫీట్ అందరినీ నివ్వెరపరుస్తోంది.