క్రీడాభూమి

దులీప్ ట్రోఫీ క్రికెట్ విజేత ఇండియా బ్లూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయడా, సెప్టెంబర్ 14: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను ఇండియా బ్లూ జట్టు కైవసం చేసు కుంది. ఇండియా రెడ్‌తో జరిగిన ఐదు రోజుల ఫైనల్‌లో 355 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా బ్లూ 9 వికె ట్లకు 693 పరుగులు సాధించగా, అందుకు సమాధానం గా ఇండియా రెడ్ మొదటి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇండియా బ్లూ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వి కెట్లకు 139 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు, బుధవారం ఆటను కొనసాగించి, ఐదు వికెట్ల కు 179 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసింది. అసాధ్యమైన 517 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయనా, ఇండియా రెడ్ కనీసం మ్యాచ్‌ని డ్రా చేసుకుంటుందని అంతా అను కున్నారు. కానీ, ఇండియా రెడ్ రెండో ఇన్నింగ్స్ అందుకు భిన్నంగా కొనసాగింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చిన రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లో మరో ఐదు వికెట్లు పడగొట్టగా, ఇండియా రెడ్ 161 పరుగులకే కుప్ప కూలింది. గుర్‌కీరత్ సింగ్ 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా, శిఖర్ ధావన్ 29 పరుగులు చేశాడు. కుల్దీప్ సింగ్ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జడేజా 76 పరుగులకు ఐదు వికెట్లు కూల్చాడు. కర్న్ శర్మ 33 పరుగు లకు మూడు వికెట్లు సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అజేయంగా 256 పరుగులు సాధించిన ఇండియా రెడ్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆరం కానున్న తరుణంలో పుజారా, జడేజా వరుసగా బ్యాటిం గ్, బౌలింగ్ విభాగాల్లో రాణించడం విశేషం.