క్రీడాభూమి

పేస్ భాగస్వామి మైనేని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: స్పెయిన్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం డేవిస్ కప్ పోరులో భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌కు భాగస్వామిగా సాకేత్ మైనేని బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి మరో డబుల్స్ ఆటగాడు రోహన్ బొపన్నతో కలిసి పేస్ ఆడాల్సి ఉండింది. అయితే, ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ బొపన్న హటాత్తుగా పోటీ నుంచి వైదొలిగాడు. దీనితో డబుల్స్ విభాగంలో పేస్‌తో కలిసి ఎవరు ఆడతారన్నది ప్రశ్నార్థకమైంది. రిజర్వ్ ఆటగాళ్లు ప్రజ్ఞేష్ గునే్నశ్వరన్, సుమీత్ నాగల్ ఏ రకంగానూ పేస్‌తో కలిసి డబుల్స్ విభాగంలో పోటీపడే స్థాయిలో లేరు. కాబట్టి పేస్ భాగస్వామిగా బరిలోకి దిగాల్సిందిగా మైనేనికి భారత టెన్నిస్ సంఘం అధికారులు సూచించే అవకాశాలున్నాయి.