క్రీడాభూమి

పోటీకి సుందర్ గైర్హాజరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: పురుషుల ఎఫ్-46 జావెలిన్‌త్రో ఈవెంట్‌లో పోటీపడాల్సిన సుందర్ సింగ్ గుజ్రార్ గైర్హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఈ విభాగంలో భారత్ నుంచి మొత్తం ముగ్గురు పోటీపడాల్సి ఉండింది. దేవేంద్రతోపాటు రింకూ హూడా, సుందర్ సింగ్ కూడా ప్రాక్టీస్ ఎరినాలో వామప్ అయ్యారు. నిర్వాహకులు పేర్లు పిలిచిన వెంటనే దేవేంద్ర, రింకూ వెళ్లగా, సుందర్ అక్కడ కనిపించలేదు. రెండుసార్లు పేర్లు పిలిచిన తర్వాత అతను గైర్హాజరైనట్టు ప్రకటించారు. వాస్తవానికి ఈ విభాగంలో పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్న త్రోయర్‌గా సుందర్ గుర్తింపు పొందాడు. చాలామంది అతనిని ఫేవరిట్‌గా పేర్కొన్నారు. కానీ, అనూహ్యంగా సుందర్ పోటీలకు గైర్హాజరయ్యాడు. దేవేంద్ర స్వర్ణ పతకాన్ని గెల్చుకోగా, రింకూ 54.39 మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసిరి ఐదో స్థానంలో నిలిచాడు.
ఇంగ్లీష్ రాకపోవడమే కారణమా?
ఇంగ్లీష్ రాకపోవడమే సుందర్ గైర్హాజరవడానికి కారణమా? పేర్లు పిలిచినప్పటికీ, ఆ ఉచ్ఛారణ అర్థంకానందువల్ల అతను సకాలంలో ఈవెంట్ జరిగే ప్రాంతానికి వెళ్లలేకపోయాడా? సుందర్ కుటుంబ సభ్యులు ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతనికి ఇంగ్లీషు రాదని, అందుకే, తన పేరును పిలిస్తున్నప్పటికీ అర్థం చేసుకోలేక వెళ్లలేకపోయాడని వారు పిటిఐతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భారత అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇందులో ఏదో మోసం ఉందని, భారత అధికార బృందంలోనే కొంతమంది కుట్ర పూరితంగా వ్యవహరించి సుందర్‌ను అక్కడ చేరుకోకుండా అడ్డుకున్నారని అతని సోదరుడు షేర్ సింగ్ ఖతానా ఆరోపించాడు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు.