క్రీడాభూమి

క్రికెట్‌కు శర్వాణ్ గుడ్‌బై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయానా, సెప్టెంబర్ 15: వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ రాంనరేష్ శర్వాణ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించాడు. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని, అధికారికంగా ప్రకటిస్తానని ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శర్వాణ్ చెప్పాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీలో అతను చివరిసారి భారత్‌పై వనే్డ ఇంటర్నేషనల్ ఆడాడు. ఆతర్వాత జట్టులో అతనికి స్థానం దక్కలేదు. 1995-96 సీజన్‌లో జరిగిన రెడ్‌స్ట్రిప్ కప్ టోర్నమెంట్‌లో బార్బడాస్‌పై గయానా తరఫున శర్వాణ్ తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. అప్పటికి అతని వయసు కేవలం 15 సంవత్సరాలు. నాలుగేళ్ల తర్వాత అతనికి మొదటి టెస్టు మ్యాచ్ ఆవకాశం లభించింది. బార్బడాస్‌లో 2000 మేలో అతను పాకిస్తాన్‌తో మొదటి టెస్టు ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 84 పరుగులు సాధించిన అతను రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 11 పరుగులు చేశాడు. 2003 మేలో ఆస్ట్రేలియాతో ఆంటిగువాలో జరిగిన టెస్టులో శర్వాణ్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతను అజేయంగా 105 పరుగులు చేసి, వెస్టిండీస్ 418 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక విజయవంతమైన స్కోరు. ఆర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను విండీస్ 0-3 తేడాతో చేజార్చుకుంది. అయితే, ఆ సిరీస్‌లనూ శర్వాణ్ రాణించాడు. నాలుగు టెస్టుల్లో 392 పరుగులు సాధించాడు. కెరీర్‌లో 15 టెస్టు శతకాలను సాధించిన శర్వాణ్‌కు వాటిలో 14 శతకాలు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగినప్పుడు లభించినవే కావడం విశేషం. కెరీర్‌లో మొత్తం 87 టెస్టులు ఆడిన అతను 5,842 పరుగులు సాధించాడు. 291 పరుగులు అతని అత్యధిక స్కోరు. 15 శతకాలు, 31 అర్ధ శతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. 181 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన అతను 5,804 పరుగులు చేశాడు. ఈ ఫార్మెట్‌లో అజేయంగా 120 పరుగులు శర్వాణ్ అత్యధిక స్కోరు. పార్ట్‌టైమ్ బౌలర్‌గానూ సేవలు అందించిన అతను టెస్టుల్లో 23, వనే్డల్లో 16 చొప్పున వికెట్లు పడగొట్టాడు.