క్రీడాభూమి

సెలక్టర్ పదవులకు దరఖాస్తులు మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: పురుషులు, మహిళలు, జూనియర్ విభాగాల్లో జాతీయ క్రికెట్ సెలక్టర్లుగా ఉండేందుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఇచ్చిన ప్రకటనకు స్పందన మొదలైంది. దరఖాస్తులు కూడా చేరుతున్నాయ. భారత మాజీ వికెట్‌కీపర్ విజయ్ దహియా, ఫాస్ట్ బౌలర్ అమిత్ భండారీ దరఖాస్తులను బిసిసిఐకి పంపారు. వీరిద్దరూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఏ విభాగంలో సెలక్టన్ కమిటీ సభ్యులుగా ఉండేందుకు ఇష్టపడుతున్నారనే విషయాన్ని వార్తు గోప్యంగా ఉంచారు. అయతే, వీరిద్దరూ పురుషుల జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉండేందుకే ఇష్టపడుతున్నారని సమాచారం. ఇలావుంటే, ఉత్తర ప్రదేశ్ క్రికెట్‌ను చాలాకాలంగా శాసిస్తున్న గోపాల్ శర్మ, జ్ఞానేంద్ర పాండే కూడా సెలక్టర్ల రేసులో ఉన్నారు. కెరీర్‌లో కనీసం ఒక టెస్టు లేదా ఒక వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ లేదా 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారు జాతీయ సెలక్టన్ కమిటీలకు దరఖాస్తు చేసుకోవాలని బిసిసిఐ ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. అభ్యర్థులకు 60 సంవత్సరాలు దాటకూడదని కూడా బిసిసిఐ స్పష్టం చేసింది. కాగా, దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బోర్డు ప్రకటించిన వెంటనే చాలా మంది మాజీ క్రికెటర్లు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దరఖాస్తుదారుల జాబితా భారీగా పెరిగే అవకాశం ఉంది.

పారాలింపియన్లకూ
‘ఖేల్ రత్న’ ఇవ్వాలి
లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్ సూచన
చండీగఢ్, సెప్టెంబర్ 15: పారాలింపియన్లకు కూడా రాజీవ్ ఖేల్ రత్న వంటి దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలను ఇవ్వాలని భారత లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్ ప్రభుత్వానికి సూచించాడు. సమ్మర్ ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన వారు ఖేల్ రత్న పురస్కారానికి అర్హులవుతారన్న నిబంధనను భారత ప్రభుత్వం పాటిస్తున్నది. అయితే, పారాలింపియన్ల విషయంలో దీనిని అమలు చేయడం లేదు. రియో పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలుసహా భారత్ ఇప్పటి వరకూ నాలుగు పతకాలు సాధించడం అద్భుతమని, ఎన్నో అవాంతరాలను, అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని ఉన్నత ప్రమాణాలను నెలకొల్పే పారా అథ్లెట్లు ఖేల్ రత్నకు ఎందుకు అర్హులు కారని మిల్కా సింగ్ ప్రశ్నించాడు. క్రీడాస్ఫూర్తికి పారా అథ్లెట్లే సజీవ రూపాలని అన్నాడు. సాధారణ అథ్లెట్లతో పోలిస్తే పారా అథ్లెట్లు చాలా శ్రమిస్తారని, వారు ప్రతి క్షణం ఎన్నో రకాలైన కష్టనష్టాలను భరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందని ‘్ఫ్లయింగ్ సిఖ్’ మిల్కా అన్నాడు. అలాంటి వారికి కూడా ఖేల్ రత్న వంటి అత్యున్నత క్రీడా పురస్కారాలు లభించి తీరాలని అభిప్రాయపడ్డాడు. రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన మరియప్పన్ తంగవేలు (పురుషుల టి-42 హైజంప్‌లో స్వర్ణం), దేవేంద్ర ఝజారియా (పురుషుల ఎఫ్-46 జావెలిన్ త్రోలో స్వర్ణం), దీపా మాలిక్ (మహిళల ఎఫ్-53 షాట్‌పుట్‌లో రజతం), వరుణ్ భాటి (పురుషుల టి-42 హైజంప్‌లో కాంస్యం)లకు ఖేల్ రత్నను ప్రకటించాలని కోరాడు. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.