క్రీడాభూమి

ఇద్దరు టెన్నిస్ అంపైర్లపై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 15: బెట్టింగ్‌కు సహకరించారన్న ఆరోపణల్లో దోషులుగా తేలడంతో ఉబ్జెకిస్తాన్‌కు చెందిన ఇద్దరు అంపైర్లు, షెర్జోద్ హసనొవ్, అర్కిప్ మొలోత్యగిన్‌లపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) జీవితకాల సస్పెన్షన్ వేటు విధించింది. నిరుడు ఇజ్రాయిల్‌లోని టిబెరియాస్‌లో జరిగిన ఐటిఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీలో వీరిద్దరూ బుకీలకు సహకరించారని విచారణలో తేలింది. సెల్‌ఫోన్ ద్వారా వీరు ఎప్పటికప్పుడు స్కోర్లను బుకీలకు చేరవేశారని ఐటిఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. బుకీలు బెట్టింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుగా స్కోర్లను డిస్‌ప్లే బోర్డుపై వీరు ఆలస్యంగా ఉంచారని వివరించింది. బెట్టింగ్‌కు పాల్పడడం లేదా సహకరించడం తీవ్రమైన నేరాలని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎవరినీ ఉపేక్షించబోమని తెలిపింది. బుకీలకు సహకరించిన కారణంగానే ఇద్దరు అంపైర్లపై జీవితకాల సస్పెన్షన్‌ను విధించామని తెలిపింది. క్రికెట్, సాకర్ మాదిరిగానే టెన్నిస్‌లోనూ బెట్టింగ్, ఫిక్సింగ్ జోరుగా సాగుతున్న ట్టు ఇటీవల వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దీనితో ఐటిఎఫ్ అన్ని టోర్నీలపైనా దృష్టి పెట్టింది. ప్ర తి చిన్న అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నది. హసనొవ్, మొలొత్యగిన్ అనుమానాస్పదంగా వ్యవహరించ డంతో వారి ఫోన్ల నుంచి వెళ్లిన కాల్స్‌ను, మెసేజీలను పరిశీలించారు. దీనితో బుకీలతో వారికి ఉన్న సంబం ధంతోపాటు వారు ఏ విధంగా సహకరించిందీ వివరాలతోసహా బట్టబయలయ్యాయ.