క్రీడాభూమి

స్టార్ అట్రాక్షన్ నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ శుక్రవారం నుంచి జరిగే డేవిస్ కప్ పోరులో స్టార్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. స్పెయిన్ ఐదు పర్యాయాలు డేవిస్ కప్‌ను కైవసం చేసుకోగా, వాటిలో నాలుగు సార్లు (2004, 2008, 2009, 2011) నాదల్ సభ్యుడుకావడం గమనార్హం. అతని ఆటను చూసేందుకు అభిమానులు స్టేడియానికి క్యూ కట్టడి ఖాయం. ఈసారి స్పెయిన్ జట్టులో నాదల్‌తోపాటు డేవిడ్ ఫెరర్, ఫెలిసియానో లొపెజ్, మార్క్ లొపెజ్ సభ్యులుగా ఉన్నారు. ఈ నలుగురు మొత్తం 65 డేవిస్ కప్ మ్యాచ్‌లను తమ మధ్య పంచుకుంటున్నారు. నాదల్, ఫెరర్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడతారు. లోపెజ్ సోదరులు ఫెలిసియానో, మార్క్ డబుల్స్ మ్యాచ్‌లో తలపడతారు. సింగిల్స్, రివర్స్ సింగిల్స్‌లో నాదల్, ఫెరర్‌లకు సాకేత్ మైనేనీ, రాంకుమార్ రామనాథన్ ఎంత వరకు పోటీనిస్తారన్నది అనుమానంగానే ఉంది. డబుల్స్‌లో లియాండర్ పేస్‌కు అపారమైన అనుభవం ఉన్నా సాకేత్‌తో కలిసి ఆడడంలో అతనికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.

51 ఏళ్ల తర్వాత..
న్యూఢిల్లీ: స్పెయిన్ జట్టుకు భారత్ 51 ఏళ్ల తర్వాత ఆతిథ్యమిస్తున్నది. 1965లో ఈ రెండు జట్లు చివరిసారి న్యూఢిల్లీలో తలపడ్డాయి. కాగా, ఇరు జట్లు ఇప్పటి వరకూ మూడు పర్యాయాలు తలపడగా, స్పెయిన్ రెండు సార్లు విజయం సాధించింది. భారత్ ఒకసారి గెలిచింది. 1922లో గ్రేట్ బ్రిటన్ వేదికగా మొదటిసారి స్పెయిన్, భారత్ జట్లు ఢీకొన్నాయి. ఆ పోరులో స్పెయిన్ 4-1 తేడాతో గెలిచింది. 1927లో భారత్‌కు స్పెయిన్ ఆతిథ్యమిచ్చింది. ఆ పోరులో భారత్ 3-2 ఆధిక్యంతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. చివరిసారి ఈరెండు జట్లు 1965లో ఇంటర్ జోనల్ ఫైనల్స్‌లో పరస్పరం ఎదురుపడ్డాయి. ఆ పోటీల్లో స్పెయిన్ 3-2 తేడాతో గెలుపొందింది.

న్యూఢిల్లీ: తొలి సింగిల్స్ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్‌తో రాంకుమార్ రామనాథన్ ఢీ కొంటాడు. కెరీర్‌లో 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న నాదల్‌కు ఫిట్నెస్ సమస్య తలెత్తితే తప్ప శుక్రవారం నాటి మొదటి సింగిల్స్‌లో అతనికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, రెండు సింగిల్స్ మ్యాచ్ సాకేత్ మైనేని, డేవిడ్ ఫెరర్ మధ్య జరుగుతుంది. శనివారం డబుల్స్ మ్యాచ్ ఉంటుంది. ఇందులో, ఫెలిసియానో లొపెజ్, మార్క్ లొపెజ్ జోడీతో లియాండర్ పేస్, సాకేత్ మైనేనీ జోడీ తలపడుతుంది. చివరి రోజైన ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. అందులో ఫెరర్‌తో రాంకుమార్, నాదల్‌తో సాకేత్ తలపడతారు.