క్రీడాభూమి

500వ టెస్టును తిలకించాలని మాజీ కెప్టెన్లకు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: న్యూజిలాండ్‌తో ఈనెల 25 నుంచి కాన్పూర్‌లో మొదలయ్యే టెస్టును చూసేందుకు రావాల్సిందిగా మాజీ కెప్టెన్లను ఆహ్వానించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయంచింది. భారత్‌కు 500వ టెస్టు కావడంతో ఆ మ్యా చ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. నారీ కాంట్రాక్టర్, చందూ బోర్డే, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్, రవి శాస్ర్తి, సునీల్ గవాస్కర్, సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, కృష్ణమా చారి శ్రీకాంత్, వీరేందర్ సెవాగ్ తదితరులు ఈ మ్యాచ్‌ని చూసేందుకు వస్తారని బోర్డు వ ర్గాలు అంటున్నాయ. ప్రస్తుతం భారత్ ‘ఎ’ కోచ్‌గా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాహుల్ ద్రవిడ్‌తోపాటు జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న అనీల్ కుంబ్లే కూడా మ్యాచ్ స మయంలో అక్కడే ఉంటారని ఈ వర్గాలు తెలిపాయ. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై స స్పెన్షన్‌కు గురైన మహమ్మద్ అజరుద్దీన్‌ను ఆహ్వానించడం లేదని సమాచారం.