క్రీడాభూమి

ఒక్క పరుగు తేడాతో కార్ట్‌రైట్ సెంచరీ మిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, సెప్టెంబర్ 16: భారత్ ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల ‘ఎ’ సిరీస్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ ఐదు వికెట్లకు 319 పరుగులు సాధించింది. హిల్టన్ కార్ట్‌రైట్ 99 పరుగులు చేసి, కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. బెయూ వెబ్‌స్టర్ 79, నిక్ మాడిసన్ 81 పరుగులతో రాణించారు. శార్దూల్ ఠాకూర్ 71 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు భారత్ ‘ఎ’ తన తొలి ఇన్నింగ్స్‌లో 169 పరుగులకే ఆలౌటైంది. హార్దిక్ పాండ్య 79 పరుగులు చేయగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా ‘ఎ’ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ 37 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించాడు.

మళ్లీ హాకీ క్యాంప్

బెంగళూరు, సెప్టెంబర్ 16: రియో ఒలింపిక్స్ తర్వాత కొంత కాలం విశ్రాంతి తీసుకున్న భారత హాకీ క్రీడాకారులకు ట్రైనింగ్ క్యాంప్ మళ్లీ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. రియోలో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత క్రీడాకారులకు ఆటవిడుపు లభించింది. ఇప్పుడు వారితోపాటు, ప్రాబబుల్స్ జాబితాలో ఉన్న మిగతా ఆటగాళ్లకు కూడా నాలుగు వారాల క్యాంప్ మొదలుకానుంది. కెప్టెన్ శ్రీజేష్‌సహా మొత్తం 26 మంది ప్రాబబుల్స్ ఈ శిబిరంలో పాల్గొంటారు. మలేసియాలో వచ్చేనెల మొదలుకానున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తలపడుతుంది. ఈ టోర్నీకి తుది జట్టును ఎంపిక చేయడానికి వీలుగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఫిట్నెస్, నైపుణ్యం, వ్యూహాలు వంటి అంశాలపై ఆటగాళ్లు దృష్టి కేంద్రీకరిస్తారు. చాంపియన్స్ ట్రోఫీసహా భవిష్యత్ టోర్నీలను దృష్టిలో ఉంచుకొని జట్టును ఎంపిక చేస్తామని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది.