క్రీడాభూమి

వైదొలగిన నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ అనారోగ్యం కారణంగా డేవిస్ కప్ మొదటి రోజు మ్యాచ్ నుంచి వైదొలిగాడు. అతను ఉదర సంబంధమైన సమస్యతో బాధపడుతున్నాడని, అందుకే, రాంకుమార్ రామనాథన్‌తో జరగాల్సిన మొదటి మ్యాచ్‌లో పాల్గొనడం లేదని స్పెయిన్ జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అతను ఆదివారం జరిగే రివర్స్ సింగిల్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇలావుంటే, స్టార్ ఆటగాడు నాదల్ బరిలోకి దిగలేకపోయినా స్పెయిన్ జోరు ఏమాత్రం తగ్గలేదు. మొదటి రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసి, 2-0 ఆధిక్యతను సంపాదించింది. రాంకుమార్ రామనాథన్‌ను ఫెలిసియానో లొపెజ్ ఓడించగా, సాకేత్ మైనేనిపై డేవిడ్ ఫెరర్ విజయం సాధించాడు.
నాదల్ అనారోగ్యం కారణంగా వైదొలగడంతో, అతని స్థానంలో తొలి సింగిల్స్ మ్యాచ్‌లో రాంకుమార్ రామనాథన్‌తో తలపడిన ఫెలిసియానో లొపెజ్ అద్భుత పోరాట పటిమను ప్రదర్శించాడు. డబుల్స్ సెపషలిస్టుగా ముద్ర పడిన అతను రాంకుమార్‌ను 6-4, 6-4, 3-6, 6-1 తేడాతో ఓడించి, స్పెయిన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
మొదటి సింగిల్స్ మ్యాచ్‌ని కోల్పోయిన భారత్ రెండో సింగిల్స్‌లో ఫెరర్‌తో తలపడే సాకేత్‌పైనే ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 13వ స్థానంలో ఉన్న ఫెరర్ తన స్థాయికి తగినట్టుగానే ఆడాడు. మొదటి సెట్‌ను సునాయాసంగా గెల్చుకున్న అతను రెండో సెట్‌లో సాకేత్ నుంచి గట్టిపోటీని ఊహించాడు. కానీ, ఫెరర్‌ను సాకేత్ ప్రతిఘటించలేకపోయాడు. చివరికి మ్యాచ్‌ని 1-6, 2-6, 1-6 తేడాతో చేజార్చుకున్నాడు. కాగా, ఈ పోటీల్లో భాగంగా శనివారం డబుల్స్ విభాగంలో మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌ని కూడా భారత్ కోల్పోతే, రివర్స్ సింగిల్స్‌తో నిమిత్తం లేకుండా స్పెయిన్ విజయభేరి మోగిస్తుంది.