క్రీడాభూమి

క్రికెట్ ప్రస్థానానికే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీవ్రవాదుల్లా చూస్తారు
మన దేశంలో ఏ ఒక్క క్రికెట్ మ్యాచ్‌లో ఓడినా జట్టులోని ఆటగాళ్లందరినీ విలన్లలా, శత్రువుల్లా, తీవ్రవాదుల్లా చూస్తారని ధోనీ అన్నాడు. 2007 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించినప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. జీవితంలో చేయరాని మహాపరాధం చేసినట్టు అందరూ తమను శత్రువులుగా చూశారని అన్నాడు. ఇలాంటి సంఘటనలు, ప్రతికూల పరిస్థితులు తన ఆలోచనా విధానాన్ని మార్చివేశాయని అన్నాడు. తన భావాలను, ఉద్వేగాలను బహిర్గతం చేయలేకపోతున్నానని తెలిపాడు.

న్యూయార్క్, సెప్టెంబర్ 16: తన జీవితం ఆధారంగా నిర్మించిన ‘ఎంఎస్ ధోనీ-ది అన్‌టోల్డ్ స్టోరీ’లో తనను ఆకాశానికి ఎత్తేయడం ఉండదని, తన క్రికెట్ ప్రస్థానానికే ప్రాధాన్యం ఇచ్చారని భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ స్పష్టం చేశాడు. ఈనెల 30న విడుదల కానున్న ఈ సినిమాలో ఒక క్రికెటర్‌గా తాను ఏ విధంగా ఎదిగానో వివరించే ప్రయత్నం జరిగిందని, డైరెక్టర్ నీరజ్ పాండే ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడని సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చిన ధోనీ విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ తాను వర్తమానానికే విలువనిస్తాననీ, అందుకే భూతకాలంలోకి వెళ్లి, డైరెక్టర్‌కు వివరాలను చెప్పడానికి కష్టపడాల్సి వచ్చిందని అన్నాడు. ‘ఈ సినిమా విడుదలైన తర్వాత ఇప్పటి వరకూ ధోనీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల్లో ఏవైనా మార్పులు ఉంటాయా?’ అన్న ప్రశ్నపై స్పందిస్తూ అలాంటిదేమీ ఉంటుందని తాను అనుకోవడం లేదన్నాడు. నిజానికి ఈ కోణంలో తాను ఆలోచించలేదని, డైరెక్టర్‌కు తాను చెప్పదలచుకున్న అన్ని వివరాలను అందించానని తెలిపాడు. ఖరగ్‌పూర్‌లో రైల్వే టికెట్ ఎగ్జామినర్‌గా పని చేసిన అనుభవం తన జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడిందని అన్నాడు. సరైన సౌకర్యాలను కల్పిస్తే క్రీడల్లో భారత్ ఎంతో అభివృద్ధి చెందుతుందని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఇప్పటి నుంచే సరైన వ్యూహరచనతో ముందుకెళితే, వచ్చే ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు సాధించే అవకాశం ఉందన్నాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలన్నాడు
ఆత్మకథ ఇప్పుడే కాదు
ఆత్మకథ రాయడానికి చాలా సమయం పడుతుందని ధోనీ చెప్పాడు. నిజానికి బయోపిక్ కంటే ముందే ఆత్మకథ రాయాలని అనుకున్నట్టు తెలిపాడు. కానీ, ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి రావడంతో పుస్తకం రాసే ఆలోచనను వాయిదా వేసుకున్నానని తెలిపాడు. ఆత్మకథ ఇప్పట్లో రాయలేనని స్పష్టం చేశాడు.

నటించడానికి కష్టపడాలి
నటన సులభం కాదని ధోనీ, అందుకు చాలా కష్టపడాలని ధోనీ వ్యాఖ్యానించాడు. బయోపిక్ ‘ఎంఎస్ ధోనీ-ది అన్‌టోల్డ్ స్టోరీ’లో తన పాత్రను తానే పోషించకపోవడానికి ఇదే ప్రధాన కారణమని అన్నాడు. సినిమాలో హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ తన పాత్రను ధరించడానికి ఎంతో శ్రమించాడని చెప్పాడు. ప్రతి చిన్నచిన్న విషయాలను కూడా అతను అడిగేవాడని, తన ఆలోచనలన్నింటినీ తెలుసుకున్న తర్వాతే సినిమాలో నటించాడని వివరించాడు. అయితే, కొన్ని విషయాలను తాను అతనితో పంచుకోలేదని ధోనీ అంగీకరించాడు. ‘నేను ఇంకా రిటైర్ కాలేదు. పైగా పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌లో భారత్‌కు నాయకత్వం వహిస్తున్నాను. కాబట్టి నేను కొన్ని విషయాలను బహిర్గతం చేయలేను. అభిప్రాయాలను చెప్పలేను. అలాంటి సున్నితమైన విషయాలను నేను దాటవేశాను’ అన్నాడు. మిగ తా విషయాలు చెప్పానని తెలిపాడు.