క్రీడాభూమి

న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రాక్టీస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యే క్రమంలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు వామప్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యతనిచ్చింది. మూడు రోజుల ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ ఎంచుకోగా తొలత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 7 వికెట్లకు 324 పరుగుల స్కోరువద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (50), థామస్ విలియ మ్ లాథమ్ (55) అర్ధ శతకాలు సాధించారు. రాస్ టేలర్ 41, మిచెల్ సాంట్నర్ 45 చొప్పున పరుగులు చేశారు. నిబంధనల ప్రకారం ఒక్కో జట్టులో 15 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. కానీ, మైదానంలో 11 మంది మాత్రమే ఉండాలి. అంతేగాక, బౌలింగ్, బ్యాటింగ్ కూడా పదకొండు మందికే పరిమితమవుతుంది. ఇలావుంటే, న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ముంబాయి 13 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మూడో బంతికే జై బిస్టా (0) అవుటయ్యాడు. ఆట ముగిసే సమయానికి కౌస్త్భు పవార్ (5), అర్మాన్ జాఫర్ (24) క్రీజ్‌లో ఉన్నారు.