క్రీడాభూమి

వర్తమానానికి తగ్గట్టు ఆలోచనలు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 17: ఎవరైనా సరే వర్తమానికి తగ్గట్టుగా ఆలోచించాలే తప్ప గతంతో పోలుస్తూ నిర్ణయాలకు రాకూడదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. కృష్ణపట్నం గోల్ఫ్ టోర్నమెంట్‌ను ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చిన అతను విలేఖరులతో మాట్లాడుతూ కనీసం 50 మ్యాచ్‌లు ఆడిన ఆల్‌రౌండర్ల మధ్యే పోలిక సాధ్యమవుతుందని అన్నాడు. తమ కాలంలో తనతోపాటు రిచర్డ్ హాడ్లీ, ఇయాన్ బోథం, ఇమ్రాన్ ఖాన్ మేటి ఆల్‌రౌండర్లుగా గుర్తింపు సంపాదించామని అన్నాడు. వీరిలో ఎవరు ఉత్తమ ఆల్‌రౌండర్ అన్న ప్రశ్నపై స్పందిస్తూ, ‘అందరి కంటే నేనే చివర ఉంటాను’ అని నవ్వుతూ చెప్పాడు. నిజానికి పోలిక మంచిది కాదని వ్యాఖ్యానించాడు. అప్పటి తరానికి, ఇప్పటి తరానికి మధ్య చాలా తేడాలు ఉన్నాయని, కాబట్టి రెండు తరాల ఆల్‌రౌండర్లను పోల్చడం తప్పని 57 ఏళ్ల కపిల్ అన్నాడు. ఇప్పుడు అందుబాటులో సమర్థులైన ఆల్‌రౌండర్లు ఉన్నారని చెప్పాడు. అయితే, పేర్లను వెల్లడించడానికి నిరాకరించాడు. చాలా మందే ఉన్నారని చెప్పాడు.