క్రీడాభూమి

సౌథీకి గాయం భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ గాయపడ్డాడు. ఫలితంగా భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతని ఎడమ కాలి మడమకు గాయమైంది. రెండు కండరాలు చిట్లాయని, దీనితో అతనికి వైద్య సేవలు అవసరమని కివీస్ జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. సుమారు రెండు వారాల విశ్రాంతి అవసరం కావడంతో, అతను స్వదేశానికి వెళతాడని, ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ మొదలయ్యేలోగా పూర్తిగా కోలుకుంటాడన్న ఆశాభావం వ్యక్తం చేసింది. 27 ఏళ్ల సౌథీ గాయపడడం న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బకాగా, భారత్‌కు ఊరటనిస్తున్నది. కెరీర్‌లో ఇప్పటి వరకూ 52 టెస్టులు ఆడి 177 వికెట్లు పడగొట్టిన అతని స్థానంలో నాలుగు టెస్టులు ఆడిన అనుభవం ఉన్న మాట్ హెన్రీ జట్టులోకి వస్తాడు.