క్రీడాభూమి

పవార్, యాదవ్ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: కౌస్త్భు పవార్, సూర్యకుమార్ యాదవ్ శతకాలు సాధించడంతో, న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగు రోజుల వామప్ మ్యాచ్‌లో ముంబయి 107 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంకా ఐదు వికెట్లు చేతిలో ఉన్నాయి. కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్లకు 431 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఒక వికెట్ నష్టపోయి 29 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించి, ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లకు 431 పరుగులు చేసింది. పవార్ 100 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌కాగా, యాదవ్ 103 పరుగులు సాధించాడు. సిద్దేష్ లాడ్ 86, ఆదిత్య తారే 53 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అర్మాన్ జాఫర్ 69 పరుగులు సాధించాడు.