క్రీడాభూమి

భారత్, కివీస్ వామప్ మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ముంబయి, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వామప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ముంబయి ఆటగాడు సిద్దేష్ లాడ్ సెంచరీ పూర్తి చేయడం మినహా చివరి రోజు ఆట సాదాసీదాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఏడు వికెట్లకు 324 పరుగులు సాధించి డిక్లేర్ చేసింది. అందుకు సమాధానంగా ముంబయి మొదటి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, శనివారం ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 431 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆటను కొనసాగించి, ఎనిమిది వికెట్లకు 464 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసింది. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే కుప్పకూలింది. అయితే, అప్పటికే ఆట సమయం ముగింపు దశకు చేరుకోవడంతో మ్యాచ్ డ్రా అయినట్టు అంపైర్లు ప్రకటించారు.

సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 7 వికెట్లకు 324 డిక్లేర్డ్ (టామ్ లాథమ్ 55, కేన్ విలియమ్‌సన్ 50, బల్వీందర్ సంధు 2/21).
ముంబయి తొలి ఇన్నింగ్స్: 8 వికెట్లకు 464 డిక్లేర్డ్ (కౌస్త్భు పవార్ 100, అర్మాన్ జాఫర్ 69, సూర్యకుమార్ యాదవ్ 103, సిద్దేష్ లాడ్ 100 నాటౌట్).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 66.4 ఓవర్లలో 235 ఆలౌట్ ల్యూక్ రోన్చీ 107, వాల్టింగ్ 43, పరీక్షిత్ వల్సాంగ్‌కర్ 3/41, సిద్దేష్ లాడ్ 2/11, విజయ్ గోహిల్ 1/61).