క్రీడాభూమి

మెస్సీ డబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, సెప్టెంబర్ 17: స్పెయిన్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో భాగంగా లెగానెస్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా ఆటగాడు లియోనెల్ మెస్సీ రెండు గోల్స్ సాధించాడు. మరో రెండు గోల్స్ రావడంతో కీలక పాత్ర పోషించాడు. అతని ప్రతిభతో బార్సిలోనా 5-1 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ 15వ నిమిషంలోనే బార్సిలోనాకు మెస్సీ తొలి గోల్‌ను అందించాడు. 31వ నిమిషంలో మరో స్టార్ ఆటగాడు లూయిస్ సౌరెజ్ గోల్ చేశాడు. 44వ నిమిషంలో బార్సిలోనా మరో కీలక ఆటగాడు నేమార్ గోల్ సాధించి, బార్సిలోనా ఆధిక్యాన్ని 3-0కు చేర్చాడు. ద్వితీయార్ధంలోనూ బార్సిలోనా విజృంభణ కొనసాగింది. 55వ నిమిషంలో మెస్సీ తన రెండో గోల్‌ను నమోదు చేశాడు. మరో తొమ్మిది నిమిషాల్లోనే అల్కాంటరా రఫిన్హా చేసిన గోల్‌తో బార్సిలోనా 5-0 ఆధిక్యానికి దూసుకెళ్లింది. మ్యాచ్ 80వ నిమిషంలో లెగానెస్‌కు గాబ్రియెల్ పిరెస్ కంటి తుడుపు గోల్‌ను అందించాడు.
చాంపియన్స్ లీగ్‌లోనూ: ఇంతకు ముందు జరిగిన చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లోనూ మెస్సీ బార్సిలోనా విజయంలో కీలక పాత్ర పోషించాడు. సెల్టిక్‌తో జరిగిన మ్యాచ్‌లో తన జట్టును 7-0 తేడాతో గెలిపించాడు. అతని విజృంభణకు ప్రత్యర్థులు ఏ దశలోనూ సమాధానం ఇవ్వలేకపోయారు. మెస్సీ మూడు గోల్స్ చేయగా, లూయిస్ సౌరెజ్ రెండు గోల్స్‌తో రాణించారు. నేమార్, ఇనీస్టా చెరొక గోల్ సాధించారు. ఇంతకు ముందు మ్యాచ్‌లో అలావెస్‌ను ఢీకొని ఓటమిపాలైన బార్సిలోనా ఈమ్యాచ్‌లో ఎలాంటి ప్రయోగాలకు ఆస్కారం ఇవ్వలేదు. ఆ మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న మెస్సీ, నేమార్‌లను సెల్టిక్‌పై బరిలోకి దించారు. స్టార్లంతా బరిలోకి దిగినందుకే తిరుగులేని విజయాన్ని నమోదు చేయడం బార్సిలోనాకు సాధ్యమైందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. లా లిగా తాజా మ్యాచ్ ఈ వాదనకు బలాన్నిస్తున్నది.

చిత్రం.. లెగానెస్‌పై రెండు గోల్స్ చేసిన మెస్సీకి
లూయిస్ సౌరెజ్ అభినందన